TE/661127 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మనం అవగాహన చేసుకొనవలసిన విషయం ఏమిటంటే, మనము శ్రీకృష్ణుని తో శాశ్వత సంబంధం కలిగియున్నాము. ఈ సంబంధాన్ని మరచిపోయి, మనము ఇప్పుడు ఈ భౌతిక శరీరంతో ఏర్పడిన సంబంధంలో నిమగ్నమై ఉన్నాము. కాని మనం అది (శరీరం) కాదు. కనుక మనము శ్రీకృష్ణుని తో శాశ్వత సంబంధము ఉన్న కార్యకలాపాలు పునః ప్రారంభించే ప్రయత్నం చేయాలి. దీనినే కృష్ణ చైతన్యమును అవలంబించుట అని అర్థము. మరియు ఆ కృష్ణ చైతన్య అభివృద్ది, శ్రీ కృష్ణుని సంపూర్ణ ప్రేమను పొందుటతో ముగుస్తుంది. మనం ఆ స్థాయికి, (భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమ), చేరుకున్నప్పుడు, ప్రతి జీవిని ప్రేమిస్తాము. ఎందుకంటే ప్రతి జీవిలో శ్రీ కృష్ణుడు ఉన్నాడు. శ్రీ కృష్ణుని తమ జీవితం లో కేంద్ర బిందువుగా చేసుకోనంత వరకు - సమానత్వం, బంధుత్వం, సోదరభావం - అనే భావన అంతా కేవలం మోసపూరితమే అవుతుంది. అది సాధ్యము కాదు."
661127 - ఉపన్యాసం CC Madhya 20.125 - న్యూయార్క్