TE/670303b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఆడుతున్న ఈ పిల్లవాడు, అతను ఇప్పుడు, అతనికి ఒక చిన్న శరీరం ఉంది. అదేవిధంగా, అతను తన తండ్రిలాంటి శరీరాన్ని పొందినప్పుడు, అతను చాలా శరీరాలను మార్చుకోవాలి. చాలా శరీరాలు. కాబట్టి శరీరాలు మారుతాయి కానీ అతను, ఆత్మ, అలాగే ఉంటుంది. ఇప్పుడు, ఈ బాల్యంలో, లేదా అతని తల్లి కడుపులో, లేదా శరీరం తన తండ్రిలాగా ఉన్నప్పుడు, లేదా శరీరం తన తాతలాగా ఉన్నప్పుడు -అదే ఆత్మ కొనసాగుతుంది . కాబట్టి ఆత్మ శాశ్వతంగా ఉంటుంది మరియు శరీరం మారుతోంది. ఇది భగవద్గీతలో వివరించబడింది: అంతవంత ఇమె దేహ నిత్యస్యోక్తః శారిరిణః (BG 2.18). ఈ శరీరం తాత్కాలికం. తాత్కాలికం. శరీరం లేదా పాత శరీరం, అవి అన్నీ తాత్కాలికమే. ప్రతి క్షణం, ప్రతి సెకను, మనం మారుతున్నాం. కానీ శరీరం లోపల ఉన్న ఆత్మ, అది శాశ్వతం."
670303 - ఉపన్యాసం SB 07.06.01 - శాన్ ఫ్రాన్సిస్కొ