TE/Prabhupada 0271 - కృష్ణుడి నామము అచ్యుతా. ఆయన ఎప్పుడూ పతనమవ్వడు



Lecture on BG 2.7 -- London, August 7, 1973


లక్షణము అదే, కానీ పరిమాణం భిన్నంగా ఉంటుంది. లక్షణము అదే అవ్వటము వలన, మనము దేవుడు వలె అన్ని ప్రవృత్తులు కలిగి వున్నాము, కృష్ణడు కలిగి ఉన్నట్లు. కృష్ణుడు తన ఆనంద శక్తితో ప్రేమపూర్వక ప్రవృత్తిని కలిగి ఉన్నాడు, శ్రీమతి రాధారాణి.. అదేవిధంగా, మనము కృష్ణుడిలో భాగం అవ్వటము వలన, మనకు ఈ ప్రేమపూర్వక ప్రవృత్తి ఉన్నది. ఇది స్వభావము మనము ఈ బౌతిక ప్రకృతితో సంబంధము ఏర్పర్చుకున్నప్పుడు ... కృష్ణుడు భౌతిక ప్రకృతి వలన ప్రభావితము కాడు. అందువలన, కృష్ణుడి నామము అచ్యుతా. ఆయన ఎప్పుడూ పతనమవ్వడు. కాని మనము పతనము అవుతాము, Prakṛteḥ kriyamāṇāni వలన. ఇప్పుడు మన మీద ప్రకృతి ప్రభావము ఉన్నది. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ ( BG 3.27) ఈ ప్రకృతి యొక్క ప్రభావము వలన మనము పతనమైతే వెంటనే, భౌతిక ప్రకృతి, అంటే ... ప్రకృతి యొక్క మూడు లక్షణాలు కలిగియున్నది, సత్వగుణము, రజో గుణము, తమో గుణము మనము ఈ లక్షణాల్లో ఒకదాన్నిలో ఉoటాము. ఇది కారణం, kāraṇaṁ guṇa-sanga ( BG 13.22) గుణ-saṅga. విభిన్న లక్షణములతో అనుబంధం ఏర్పర్చుకోనుట. Guna-saṅga asya jīvasya, జీవికి. ఇది కారణం. ఒక వ్యక్తిని అడగవచ్చు: "జీవి దేవుడు లాగా వుంటాడు కదా, ఎందుకు ఒక జీవి కుక్కలాగా మారింది, ఒక జీవి దేవుత లాగా మారింది, దేవతలా, బ్రహ్మాలాగా? " ఇప్పుడు సమాధానం కారణం. దీనికి కారణం guṇa-saṅga asya. Asya jīvasya guṇa-saṅga. ఎందుకంటే అతడు ఒక ప్రత్యేకమైన గుణముతో సంభందము కలిగి వున్నాడు.సత్వ గుణము, రజో గుణము, తమో గుణము.

ఈ విషయాలు ఉపనిషత్లో చాల స్పష్టంగా వివరించబడ్డాయి, guṇa-sanga ఎలా పనిచేస్తుంది. ఒక అగ్ని వలె . అగ్ని కణములు ఉన్నాయి. కొన్నిసార్లు కణములు అగ్ని నుండి బయిట పడతాయి. ఇప్పుడు అగ్నికణములు మూడు పరిస్థితులలో క్రింద పడిపోతాయి. పొడి గడ్డి మీద అగ్ని కణము పడితే, వెంటనే అది గడ్డిని, పొడి గడ్డిని మండించగలదు. అగ్ని కణము సాధారణ గడ్డి మీద పడితే, అది కొంత సమయం వరకు దహించి, మరలా ఆరిపోతుంది. కానీ అగ్ని కణము నీటి మీద పడితే, వెంటనే ఆరిపోతుంది, మండుతున్న లక్షణము. సత్వా-గుణము, సత్వా-గుణములో ఉన్నవారు , వారు తెలివైనవారు. వారికి జ్ఞానం ఉన్నది. ఉదాహరణకు బ్రహ్మణల వలె. రజో గుణముచే బంధించబడి ఉన్నవారు, వారు భౌతిక కార్యక్రమాలలో బిజీగా ఉoటారు. తమో గుణములో ఉన్నవారు, వారు సోమరులు నిద్రపోతుంటారు. అంతే. ఇవి లక్షణాలు. తమో- గుణము అంటే అర్థం వారు చాలా సోమరులు నిద్రపోతుంటారు. రజో గుణములో వారు చాలా చురుకుగా ఉంటారు, కానీ కోతిలాగా చురుకుగా ఉంటారు. ఉదాహరణకు కోతి చాలా చురుకుగా, ఉంటుంది, కానీ అది చాల ప్రమాదకరమైనది వెంటనే ... కోతిని, మీరు సోమరిగా చూడరు. అది కూర్చున్నప్పుడల్లా, అది "gat gat gat gat అని శబ్దము చేస్తుంది".