TE/Prabhupada 0371 - అమారా జీవన యొక్క భాష్యము



Purport to Amara Jivana in Los Angeles


"Āmāra jīvana sadā pāpe rata nāhiko puṇyera leśa". భక్తివినోద ఠాకురా వైష్ణవు వినయముతో పాడిన పాట ఇది, . ఒక వైష్ణవుడు ఎల్లప్పుడు సాత్వికుడు మరియు వినయము కలిగి ఉంటాడు. అందువల్ల అయిన సాధారణ ప్రజల జీవితాన్ని, తాను వారిలో ఒకనిగా వుండి, వివరిస్తున్నారు సాధారణంగా ప్రజలు ఇక్కడ ఇచ్చిన వివరణ వలె ఉంటారు. అయిన ఇలా అన్నాడు, "నా జీవితం ఎల్లప్పుడూ పాపములలో వినియోగించ బడినది, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, మీరు పవిత్ర కార్యక్రమాల యొక్క ఒక ఆనవాలు కుడా కనుగొనలేరు. పూర్తిగా పాపములు మాత్రమే ఉన్నాయి. నేను ఇతర జీవులకు ఎల్లప్పుడూ ఇబ్బందులు కలుగ చేయటానికి అనుకూలముగా ఉన్నాను. అది నా పనిగా భావించాను. ఇతరులు బాధపడటము,నేను ఆనందించడము నేను చూడాలనుకుంటున్నాను .

"Nija sukha lāgi' pāpe nāhi ḍori". నా వ్యక్తిగత ఇంద్రియ తృప్తి కోసం, ఏ పాపమైన చేయుటకు నేను వేనుకాడను. అంటే నా ఇంద్రియాలకు సంతృప్తికరంగా ఉంటే ఏ విధమైన పాపమును చేయుటకు నేను అంగీకరిస్తాను.

"Dayā-hīna swārtha-paro." నేను ఎ మాత్రము కరుణ కలిగి లేను నేను నా వ్యక్తిగత ఆసక్తి కొరకు మాత్రమే చూస్తాను.

"Para-sukhe duḥkhī" ఇతరులు బాధపడుతున్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను, ఎల్లప్పుడూ అబద్ధాలు మాట్లాడతాను,

"sadā mithyā-bhāṣī." సాధారణ విషయాలకు కూడా నేను అసత్యాలు మాట్లాడటానికి అలవాటుపడ్డాను.

"Para-duḥkha sukha-karo." ఒకరు బాధ పడుతూ ఉంటే, అది నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది."

"Aśeṣa kāmanā hṛdi mājhe mora." నేను నా హృదయంలో చాల కోరికలను కలిగి ఉన్నాను, నేను ఎల్లప్పుడూ కోపంగా, మరియు గర్వమును కలిగి ఉన్నాను, ఎల్లప్పుడూ అహంకారముతో ఉన్నాను.

"Mada-matta sadā viṣaye mohita." నేను ఇంద్రియ తృప్తి విషయాలలో ఆకర్షించబడ్డాను దాదాపు నేను పిచ్చి పట్టి ఉన్నాను.

"Hiṁsā-garva vibhūṣaṇa" నా ఆభరణాలు అసూయ మరియు గర్వము.

"Nidralāsya hata sukārje birata" నేను అణచివేయబడ్డాను, మరియు నేను నిద్ర సోమరితనము చే జయింపబడ్డాను.

"sukārje birata" నేను పవిత్ర కార్యక్రమాలకు ఎప్పుడూ విముఖంగా ఉన్నాను.

"Akārje udyogī āmi" నేను అపవిత్ర కార్యక్రమాలను చేయుటకు చాలా ఉత్సాహంగా ఉన్నాను.

"Pratiṣṭha lāgiyā śāṭhya-ācaraṇa" నా ప్రతిష్టకుకోరకు ఇతరులను నేను ఎల్లప్పుడూ మోసం చేస్తాను.

"Lobha-hata sadā kāmī" నేను దురాశచే జయింపబడ్డాను. ఎల్లప్పుడూ కామముతో ఉన్నాను

"Eheno durjana saj-jana-barjita" నేను చాలా పతితుడైనాను, నాకు భక్తుల సాంగత్యము లేదు." అపరాధి, "అపరాధి," నిరంతర, "ఎల్లప్పుడూ.

"Śubha-kārja-śūnya" నా జీవితంలో పవిత్ర కార్యక్రమాలను కొంచము కుడా చేయ లేదు,

"sadānartha manāḥ" నా మనస్సు ఎల్లప్పుడూ కొంటె పనులకు ఆకర్షించబడి ఉన్నాది.

"Nānā duḥkhe jara jara" అందువలన నా జీవితం యొక్క చివరి దశలో, నేను అలాంటి అన్ని బాధలచే , దేనికి పనికి రాకుండా పోయాను దాదాపుగా.

"Bārdhakye ekhona upāya-vihīna" నా వృద్ధాప్యంలో ఇప్పుడు నాకు ఇంకో ప్రత్యామ్నాయం లేదు,

"tā 'te dīna akiñcana" బలవంతముగా, నేను ఇప్పుడు చాలా వినయపూర్వకముగా మరియు సాత్వికముగా మారాను.

"Bhaktivinoda prabhura caraṇe" అందుచే భక్తివినోద ఠాకురా సమర్పిస్తున్నారు దేవాదిదేవుడు యొక్క కమల పాదముల వద్ద తన జీవితము యొక్క కార్యక్రమాల ప్రకటనను. "