TE/Prabhupada 0372 - అనాది కర్మ ఫలే యొక్క భాష్యము



Anadi Karama Phale and Purport - Los Angeles


Anādi karama-phale. Anādi karama-phale pori' bhavārṇava-jale taribāre nā dekhi upāya. ఈ పాటను భక్తివినోద ఠాకురా పాడారు, బద్ధుడైన ఆత్మ యొక్క పరిస్థితిని చూపేడుతున్నరు. ఇది ఇక్కడ చెప్పబడింది, భక్తివినోద ఠాకురా చెప్పుతున్నరు, సాదారణ మానవునిగా తనను తాను తీసుకుంటున్నరు, నా గత ఫలాపేక్ష కార్యక్రమాల వలన , నేను ఇప్పుడు చీకటి సముద్రంలో పడిపోయాను, ఈ గొప్ప మహసముద్రం నుండి బయటికి రావటానికి నాకు ఏమత్రం దారి కనబడటములేదు. ఇది కేవలం విషపు సముద్రం వలె ఉన్నాది,

e viṣaya-halāhale, divā-niśi hiyā jvale. ఎవరైనా కొంచెము కారపు ఆహరన్ని తీసుకుంటే, అది హృదయములో మంటా ఇస్తుంది. అదేవిధముగా, మనము ఇంద్రియా ఆనందముతో సంతోషంగ ఉండటనికి ప్రయత్నిస్తున్నాము, వాస్తవానికి, అది మనకు హృదయములో , వ్యతిరేకం అవుతుంది. హృదయములో మంటను కలిగించుటకు కారణము అవ్వుతుంది

E viṣaya-halāhale, divā-niśi hiyā jvale, ఆ ,మంటా కలిగించే భావము ఇరవై నాలుగు గంటలు, పగలు రాత్రి ఉంటూనే ఉంది.

Mana kabhu sukha nāhi pāya, దీని వలన నా మనసులో సంతృప్తి లేదు.

Āśā-pāśa-śata-śata kleśa dey abirata, నేను ఎల్లప్పుడూ ఆలోచనలు చేస్తున్నాను, వందలు వేలు, నేను సంతోషంగా ఎల ఉండగలను, కానీ నిజానికి వారు అందరూ నాకు ఇబ్బందులు, బాధలు, ఇరవై నాలుగు గంటల ఇస్తున్నారు.

Pravṛtti-ūrmira tāhe khelā, ఇది సరిగ్గా సముద్రపు తరంగాలను పోలి ఉంటుంది, ఎల్లప్పుడూ ఒకదానితో మరొకటి కొట్టకోవడము, అది నా పరిస్థితి.

Kāma-krodha-ādi caya, bāṭapāre dey bhaya, ,అంతే కాకుండా చాల మంది దొంగలు పోకిరిలు ఉన్నారు. ముఖ్యంగా వారు ఆరుగురు ఉన్నారు, అవి కామము, కోపం, ఆసూయ, భ్రాంతి, అనేక మార్గాలు ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ ఉన్నాయి, నేనువాటికి భయపడ్డుతున్నాను.

Abasāna hoilo āsi 'belā, ఈ విధముగా, నా జీవితము ఉన్నత స్థానమునకు వచ్చింది, లేదా నేను ముగింపు దశకు వస్తున్నాను.

Jñāna-karma ṭhaga dui, మరింత pratāriyā loi, ఇది నా పరిస్థితి అయినప్పటికీ, ఇప్పటికీ, రెండు రకముల కార్యక్రమాలు, అవి మానసిక కల్పన ఫలాపేక్ష కార్యక్రమాలు, అవి నన్ను మోసం చేస్తున్నాయి.

Jñāna-karma ṭhaga, ṭhaga అంటే మోసగడు.

jñāna-karma ṭhaga dui, more pratāriyā loi ఉన్నాయి, వారు నన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు,

abaśeṣe fele sindhu-jale, నన్ను తప్పుదోవ పట్టిoచిన తరువాత, సముద్ర తీరానికి నన్ను తీసుకొని వచ్చి సముద్రంలోకి నన్ను నెట్టేస్తారు.

E heno samaye bandhu, tumi kṛṣṇa kṛpā-sindhu, ఈ పరిస్థితులలో, నా ప్రియమైన కృష్ణ, నీవు మత్రమే నాకు స్నేహితుడివి,

tumi kṛṣṇa kṛpā-sindhu Kṛpā kori' tolo more bale, ఇప్పుడు నాకు ఈ చీకటి మహసముద్రము నుండి బయటకు రావడనికి ఎటువంటి శక్తి లేదు, నా వినతి, మీ కమల పాదములకు ప్రార్ధన చేస్తున్నాను, నన్ను మీ బలము ద్వార , మీరు నన్ను రక్షించండి.

Patita-kiṅkare dhari' pāda-padma-dhūli kori, ఏమైనప్పటికీ, నేను మీ శాశ్వత సేవకుడిని. కావున, ఎట్లగైతేనే, నేను ఈ సముద్రంలో పతితుడైనాను, మీరు దయ చేసి నన్ను రక్షించండి మీ కమల పాదముల దగ్గర ఒక దుమ్ముగా నన్ను ఉండనివ్వండి

Deho bhaktivinoda āśraya, భక్తి వినోద ఠాకురా వేడుకొను చున్నాడు దయచేసి మీ కమల పాదముల దగ్గర నాకు ఆశ్రయం ఇవ్వండి.

Āmi tava nitya-dāsa వాస్తవమునకు, నేను మీ శాశ్వత సేవకుడిని.

Bhuliyā māyāra pāś, ఏదో ఒకవిధముగా నేను మిమల్ని మరచిపోయాను, ఇప్పుడు నేను మాయ యొక్క నెట్వర్క్లో పడిపోయాను.

Baddha ho'ye āchi doyāmoy, నా ప్రియమైన ప్రభు, నేను ఈ విధముగా చిక్కుకున్నాను. దయచేసి నన్ను కాపాడండి.