TE/Prabhupada 0414 - దేవాది దేవుడైన శ్రీ కృష్ణుని సమీపించడం



Lecture & Initiation -- Seattle, October 20, 1968


ప్రభుపాద: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi.

ప్రేక్షకులు: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi.

ప్రభుపాద: ఈ కృష్ణచైతన్య ఉద్యమం అంటే దేవాది దేవుడైన శ్రీ కృష్ణుని సమీపించడం. ఇది కృష్ణ చైతన్యం అంటే, స్పష్టమైన మార్గం. ఇది చైతన్య మహా ప్రభువు యొక్క ప్రత్యేకమైన బహుమతి. ఈ కలియుగంలో చాలా విపరీత విషయాలు ఉన్నాయి. మానవ జీవితంలో చాలా లోపాలున్నాయి. క్రమంగా వారు కృష్ణ చైతన్యం లేదా దేవుని చైతన్యమనే ఆలోచననే వదిలి వేస్తున్నారు. కేవలం క్రమంగా వదిలి వేయడం కాదు, వారు ఇప్పటికే వదిలివేశారు. అందువలన వేదాంత సూత్రం చెబుతుంది అథాతో బ్రహ్మ జిజ్ఞాస.. ఇది మనం ప్రవేశపెట్టిన వేరొక రకమైన మత పద్ధతి కాదు. ప్రస్తుత రోజులలో ఇది చాలా అవసరం. కనుక మనం చెబుతున్నాం మీరు బైబిలు గ్రంథాన్ని అనుసరించవచ్చు లేదా ఖురాను లేదా వేదాలను అనుసరించవచ్చు, లక్ష్యం మాత్రం భగవంతుడే. కానీ ప్రస్తుత సమయంలో ఈ కలియుగ ప్రభావం వల్ల కలియుగ అంటే వైరము మరియు అసమ్మతి ఉండే యుగం. ఈ యుగంలో ప్రజలు చాలా విధాలుగా ఇబ్బందులు పడతారు. మొదటి అనర్హత వారు దీర్ఘకాలం జీవించుట లేదు. భారత దేశంలో సగటు జీవితకాలం 35 సంవత్సరాలు, ఇక్కడ సగటు వయస్సు ఎంతో నాకు పూర్తిగా తెలియదు, కానీ భారతదేశంలో ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు, వారికి సరైన మేధస్సు లేదు లేదా వారు భారతదేశం బయటకు వెళ్ళటానికి పట్టించుకోలేదు, ప్రతి ఒక్కరూ దోచుకోవాలని వెళ్ళారు..... కానీ ఇతర దేశాలను దోచుకోవాలని వారు ఎప్పుడు ఆలోచించలేదు. అది వారి సంస్కృతి... ఇతరుల ఆస్తులను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించరు. ఏదేమైనా భారతదేశం యొక్క పరిస్థితి చాలా అస్థిరంగా ఉన్నది, ఎందుకంటే వారు తమ సొంత సంస్కృతిని వదిలివేశారు. మరియు వారు పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు, చాలా విషయాలలో, అందువలన వారు వాటి మధ్య ఇరుక్కు పోతున్నారు. సిసిల్లా మరియు చారీబీడ్స్ కొమ్ముల మధ్య ఇరుక్కొని పోయినట్లు, మీరు చూడoడి.

ఈ యుగము అలా ఉంటుంది. భారత దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఇబ్బందులు వేరే రకంగా ఉన్నాయి. సమస్యలు భిన్నంగా ఉంటాయి, కానీ అది భారతదేశంలో లేదా అమెరికాలో లేదా చైనాలో ఎక్కడైనా సరే సమస్యలు ఉన్నాయి. అన్ని చోట్లా, వారు ప్రపంచ శాంతి కోసం అనేక పథకాలు చేస్తున్నారు. మీ దేశంలో కూడా అమెరికాలో సైతం కెనడీ వంటి గొప్ప వ్యక్తులకు కూడా భద్రత లేదు. మీరు చూస్తున్నారు, ఎవరైనా ఏ సమయంలోనైనా చంప బడవచ్చు, ఏమీ చేయలేరు. అక్కడ ఇంకొక సమస్య ఉంది కమ్యూనిస్టు దేశంలో వారు బలవంతంగా వారి పౌరులపై పాలన చేస్తున్నారు. చాలామంది రష్యన్లు చాలా మంది చైనీయులు వారు తమ దేశం నుండి బయటకు వెళ్తున్నారు వారు ఈ కమ్యూనిస్టు ఆలోచనలను ఇష్టపడరు. ఈ సమస్యలన్నీ ఈ యుగ ప్రభావం వల్లనే జరుగుతున్నాయి. కలి యుగం కారణంగా, సమస్యలు ఉన్నాయి. ఏమిటా సమస్యలు? సమస్యలు ఏమిటంటే ఈ యుగములో ప్రజల జీవిత కాలం, చాలా స్వల్పకాలికంగా ఉంటుంది. మనం ఏ సమయంలో అయినా చనిపోతామని మనకు తెలియదు. ఇది చెప్పబడింది, రామచంద్రుని యొక్క పాలన సమయంలో, ఒక బ్రాహ్మణ... (పక్కన:)అది పని చేయడములేదా? ఒక బ్రాహ్మణుడు అతను రాజు దగ్గరకు వచ్చాడు, "నా ప్రియమైన రాజా, నా కుమారుడు చనిపోయాడు. దయచేసి వివరించుము, ఎందుకు తండ్రి సమక్షంలో, కుమారుడు చనిపోతాడు." రాజు ఎంత బాధ్యత వహిస్తున్నాడో చూడండి. ఒక వృద్ధుడైన తండ్రి రాజుకు ఫిర్యాదు చేయడానికి వచ్చాడు, తండ్రి సమక్షంలో, ఒక కుమారుడు చనిపోవడానికి కారణం ఏమిటి? దయచేసి వివరించుము. అందువల్ల ఎంత బాధ్యతగల ప్రభుత్వము అక్కడ ఉందో చూడండి. తండ్రి కంటే ముందు కొడుకు మరణిస్తే ప్రభుత్వం బాధ్యత వహిస్తున్నది. సహజంగానే, తండ్రి, కొడుకు కంటే పెద్దవాడు, అతను మొదట చనిపోవాలి. అక్కడ అటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు నాగరిక ప్రపంచంలో ఎవ్వరివలనైనా ఎవరైనా చంపబడతారు, కానీ ఎవరూ దాని గురించి పట్టించుకోరు