TE/Prabhupada 0415 - ఆరునెలల్లో మీరు దేవుడు అవుతారు చాలా మూర్ఖపు అంతిమ నిర్ణయం



Lecture & Initiation -- Seattle, October 20, 1968


ఈ యుగంలో జీవిత కాలం చాలా అస్పష్టంగా ఉంది. ఏ సమయంలోనైనా మనం చనిపోవచ్చు. కానీ ఈ జీవితం, ఈ మానవజన్మ అద్భుతమైన లాభం కోసం ఉద్దేశించబడింది. అది ఏమిటి? మన జీవిత దుర్భర పరిస్థితికి శాశ్వత పరిష్కారం చేసుకోవడం. దీనిలో,మనము ఎంత కాలము ఈ భౌతిక రూపంలో ఈ శరీరంలో ఉంటామో, మనం ఒక శరీరం నుండి మరొక దానికి, ఒక శరీరం నుండి ఇంకొక దానికి మారావలసి ఉంటుంది. Janma-mṛtyu-jarā-vyādhi ( BG 13.9) మళ్లీ తిరిగి జన్మించడం, మళ్లీ మరణించడం. ఆత్మ శాశ్వతమైనది, కానీ మారుతున్నది, మీరు దుస్తులు మార్చుకుంటున్నట్లుగా... ఈ సమస్యను వారు పరిగణనలోకి తీసుకోవడం లేదు, కానీ ఇది సమస్య, మానవ జీవితం ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ఉద్దేశించబడింది. కానీ వారికి ఎటువంటి పరిజ్ఞానం లేదు లేదా వారు ఈ సమస్యలను గంభీరంగా తీసుకోవడం లేదు. వ్యవధి, మీరు సుదీర్ఘ జీవితకాలం పొంది ఉంటే, అప్పుడు మీకు ఎవరినైనా కలిసే అవకాశం ఉంది. మీరు మంచి సాంగత్యాన్ని తీసుకున్నట్లయితే ఈ జీవితంలోనే పరిష్కారం పొందుతారు. కాని జీవిత కాలం చాలా తక్కువగా ఉన్నందున అది ఇప్పుడు అసాధ్యము. Prāyeṇa alpāyuṣaḥ sabhya kalāv asmin yuge janāḥ mandāḥ. మనకు లభించిన జీవిత కాలాన్ని కూడా మనం సరిగ్గా ఉపయోగించు కోవడం లేదు. మన జీవితాన్ని కేవలం జంతువుల వలె వినియోగించుకుంటున్నాం, కేవలం తినడం, నిద్రపోవడం, సంయోగం మరియు రక్షించుకోవడం అంతే. ఈ యుగంలో ఎవరైనా ఖరీదైన మంచి ఆహారము తినగలిగినట్లయితే, “ఈ రోజు నా కర్తవ్యం ముగిసింది” అని అతను అనుకుంటాడు. ఎవరైనా భార్యను ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కలిగి ఉంటే అతడు గొప్ప వాడుగా పరిగణించబడతాడు. అతను ఒక కుటుంబాన్ని పోషిస్తున్నాడు . కారణం చాలా మంది కుటుంబాన్ని కలిగి లేకుండా ఎటువంటి బాధ్యత లేకుండా ఉన్నారు. ఇది ఈ యుగం యొక్క లక్షణాలు.

మనం చాలా తక్కువ జీవితకాలం కలిగి ఉన్నప్పటికీ, మనం గంభీరంగా తీసుకోవడం లేదు. మందః చాలా నెమ్మదిగా ఉన్నాము. ఇక్కడ లాగా, మనం కృష్ణచైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్నాము. ఈ ఉద్యమాన్ని తెలుసుకోవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఎవరూ తీవ్రంగా ప్రయత్నించడం లేదు. ఎవరైనా ఆసక్తి కలిగి ఉన్నా, వారు మోసగించబడాలని కోరుకుంటున్నారు. వారు చౌక ఐనది కోరుకుంటున్నారు ఆత్మ సాక్షాత్కారం కోసం చౌక ఐనది కోరుకుంటున్నారు. వారు డబ్బు కలిగి ఉన్నారు వారు కొంత రుసుము చెల్లించాలని కోరుకుంటారు. మరియు అతను చెప్తాడు నేను మీకు ఒక మంత్రం ఇస్తాను, మీరు సిద్ధమా పదిహేను నిమిషాలు ధ్యానం చేయండి ఆరునెలల్లో మీరు దేవుడు అవుతారు. ఇలాంటి విషయాలు వారు కోరుకుంటున్నారు మందః మంద మతయో మంద మతయో అంటే చాలా మూర్ఖపు అంతిమ నిర్ణయం వారు జీవిత సమస్యల పరిష్కారం గురించి ఆలోచించడం లేదు. కేవలం 35 డాలర్లు చెల్లించి కొనుగోలు చేయవచ్చునా? అది చాలా మూర్ఖత్వము. ఎందుకంటే? మీ జీవిత సమస్యల పరిష్కారం కోసం, మేము అలా చెప్పము. “మీరు ఈ సూత్రాలను అనుసరించాలి.” ఇది చాలా కష్టము. నేను 35 డాలర్లు చెల్లించి పొందుతాను, ఒక పరిష్కారం సాధిస్తాను. మీరు చూడండి వారు మోసగింపబడాలని కోరుకుంటున్నారు వారిని మందమతులు అని పిలుస్తారు. మరియు మోసగాళ్లు వస్తారు మోసం చేస్తారు Mandāḥ sumanda-matayo manda-bhāgyā ( SB 1.1.10) మంద భాగ్య అంటే వారు దురదృష్టవంతులు భగవంతుడు వచ్చి ప్రచారం చేసినా, నా దగ్గరకు రండి అని వారు దానిని పట్టించుకోరు. మీరు చూడoడి? అందువలన ఇది చాలా దురదృష్టకరం ఎవరైనా వచ్చి మీకు లక్ష డాలర్లను అందిస్తే నాకు ఇష్టం లేదు అని చెబితే మీరు దురదృష్టవంతులు కాదా చైతన్య మహాప్రభువు ఇలా చెప్పారు

harer nāma harer nāma harer nāma eva kevalam
kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā
(CC Adi 17.21)

ఆత్మ సాక్షాత్కారం కోసం మీరు కేవలం హరేకృష్ణను జపించి, ఫలితాన్ని పొందుతారు. లేదు, వారు అంగీకరించరు కనుక దురదృష్టకరం. మీరు ఈ ఉత్తమ విషయాలను ప్రచారం చేస్తే, ఈ సులభమైన పద్దతి కానీ వారు అంగీకరించరు వారు మోసగింపబడాలని కోరుకుంటారు. మీరు చూడండి? Mandāḥ sumanda-matayo manda-bhāgyā hy upadrutāḥ ( SB 1.1.10) మరియు చాలా బాధించబడే (వేధించబడే) విషయాలున్నాయి - ఈ ముసాయిదా సంఘo, ఆ సంఘo ఈ సంఘo, ఇది , అది చాలా విషయాలున్నాయి. ఇది వారి పరిస్థితి చాలా చిన్న జీవితం, చాలా నిధానము చాలా తక్కువ అవగాహన అర్థం చేసుకునేది లేదు. మరియు అర్థం చేసుకోవాలనుకున్నా, వారు మోసగింపబడాలనే కోరుకుంటారు, వారు దురదృష్టవంతులు వారు అశాంతిగా ఉన్నారు. ఇది ఈ రోజుల్లోని పరిస్థితి. మీరు ఎక్కడ జన్మించారన్నది అమెరికాలోనా లేదా భారతదేశంలోనా అనేది ముఖ్యం కాదు (పట్టింపు లేదు) ఇది మొత్తము పరిస్థితి