TE/Prabhupada 0440 - మాయావాద సిద్దాంతం ప్రకారం అంత్యమున ఆత్మ నిరాకారమైనది



Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968


ప్రభుపాద:తర్వాత చదవండి.

భక్తుడు: "శ్వేతాశ్వతర ఉపనిషత్తు లో, భగవంతుడు అసంఖ్యాక జీవులకు పోషకుడని చెప్పబడివుంది, వారి వేర్వేరు పరిస్థితులకు అనుగుణంగా, వ్యక్తిగత కర్మల మరియు వాటి ప్రతిచర్యలను బట్టి. భగవంతుడు , అతని విభిన్న అంశల రూపంలో , ప్రతి జీవి యొక్క హృదయంలో ఉపస్థితుడై వున్నాడు. కేవలం సాధు మహాత్ములు ఎవరైతే ఆ భగవంతున్ని అంతరమున మరియు బాహ్యమున దర్శించగలుతుంటారో, వాస్తవానికి వారు మాత్రమే శాశ్వతమైన పరిపూర్ణ శాంతిని పొందగలరు. ఇక్కడ పేర్కొన్న అదే వేదముల సత్యాన్ని అర్జునుడికి ఉపదేశించబడింది ,మరియు అదేసమయంలో అది ప్రపంచంలోని అందరి వ్యక్తులకు ఉద్దేశించబడింది. జ్ఞానవంతులు కాకపోయినా తమను తాము పండితులుగా ప్రదర్శించుకునే వారందరికీ ఉద్దేశించబడింది. భగవంతుడు స్పష్టంగా చెప్పాడు, తాను,అర్జునుడు,మరియు యుద్ధభూమిలో సమావేశమైన రాజులందరూ, శాశ్వతమైన వ్యక్తిగతులు, భగవంతుడు శాశ్వతంగా వ్యక్తిగత జీవుల యొక్క పోషకుడు."

ప్రభుపాద: వాస్తవ శ్లోకం ఏమిటి? నువ్వు చదువు.

భక్తుడు: "నేను గానీ, నీవు గానీ, ఈ రాజులందరు గానీ వ్యక్తిగతంగా నిలిచివుండని సమయం అంటూ లేదు ... (B.G 2.12)"

ప్రభుపాద: ఇప్పుడు, "నేను వ్యక్తిగతంగా లేనటువంటి సమయంగానీ, నీవు గాని, ఈ ప్రజలూ వ్యక్తిగతంగా లేనటువంటి సమయంగానీ లేదు." ఇప్పుడు అతను విశ్లేషణత్మకంగా చెప్తాడు, "నేను, మీరు, మరియు ..." మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి. అది పూర్తయింది. "నేను, మీరు, ఇతరులు." కృష్ణుడు ఇలా అంటాడు, "నేను, నీవు, మరియు ఈ యుధ్ధరంగంలో సమావేశమయిన ఈ వ్యక్తులందరూ వ్యక్తిగతంగా లేనటువంటి సమయం లేదు. " అంటే "గతంలో, నేను, నీవు, మరియు వారందరూ వ్యక్తిగతంగా ఉన్నారు." వ్యక్తిగతంగా. మాయావాది సిధ్ధాంతం అనేది అంతిమంగా ఆత్మ నిరాకారము. అటువంటప్పుడు కృష్ణుడు ఎందుకు అలా చెప్పాడు "నేను, నీవు, ఈ మనుష్యులు వ్యక్తిగతంగా నిలిచివుండని సమయం ఎన్నడూ లేదు"అని అంటే, "నేను వ్యక్తిగతంగా ఉన్నాను, నీవూ వ్యక్తిగతంగా వున్నావు, మరియు మన ముందు ఉన్న ఈ వ్యక్తులు, వారు కూడ వ్యక్తిగతంగా ఉన్నారు. అలా ఉండని సమయం లేదు. "ఇప్పుడు, మీ జవాబు ఏమిటి, దీనదయాల? మనం అందరమూ కలిసిపోయాము అని కృష్ణుడు ఎన్నడూ చెప్పలేదు. మనము అందరమూ వ్యక్తిగతులము. మరియూ అతను చెప్పాడు, "మరోవిధంగా మనం వుండబోము ... మనము వ్యక్తిగతంగా లేనటువంటి సమయం లేదు. "అని గతంలో మనము వ్యక్తులుగా మనుగడలో ఉన్నాము, ప్రస్తుతం సందేహం లేకుండా మనము వ్యక్తిగతంగా జీవిస్తూ ఉన్నాం, మరియు భవిష్యత్తులో కూడా, మన వ్యక్తిత్వాలు ఇలానే కొనసాగుతాయి. అలాంటప్పుడు నిరాకారవాదం అనే ప్రశ్న ఎలా ఉదయిస్తుంది? గతంలోనూ, ప్రస్తుతములోనూ, భవిష్యత్తులో ఇలా మూడు సందర్బాలు వున్నాయి. అన్ని సందర్బాల్లోనూ మనము వ్యక్తిగతులము. భగవంతుడు నిరాకారుడైతే లేక నేను నిరాకారున్ని అయితే లేక నీవు నిరాకారునివైతే, అవకాశం ఎక్కడ ఉంది? కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, "నేను, నీవు, ఈ రాజులు లేదా సైనికులు వ్యక్తిగతంగా నిలిచివుండని సమయం లేదు ... అది గతంలోనూ మనం ఉండని సమయం లేదు. " కాబట్టి గతంలో కూడా మనము వ్యక్తిగతంగా ఉన్నాము, మరియు ప్రస్తుతం కూడా ఏ మాత్రం సందేహం లేదు. మనము వ్యక్తిగతంగా జీవిస్తూ వున్నాము. మీరు నా శిష్యులు, నేను మీ ఆధ్యాత్మిక గురువును, కానీ మీరు మీ వ్యక్తిత్వాన్ని కలిగివున్నారు, నేను నా వ్యక్తిత్వాన్ని కలిగి వున్నాను. మీరు నాతో ఏకీభవించకపోతే, మీరు నన్ను వదిలివేయవచ్చు. అది మీ వ్యక్తిత్వం. అదేవిధంగా మీరు కృష్ణుడిని ఇష్టపడకపోతే, మీరు కృష్ణ చైతన్యములోకి వచ్చేవారు కాదు, అది మీ వ్యక్తిత్వం. అలా ఈ వ్యక్తిత్వం కొనసాగుతుంది. అదేవిధంగా కృష్ణుడు, అతను మిమ్మల్ని ఇష్టపడకపోతే, అతను మిమ్మల్ని కృష్ణ చైతన్యంలో నిరాకరించవచ్చు. మీరు అన్ని నియమాలు నిబంధనలను అనుసరిస్తున్నందున, కృష్ణుడు మిమ్మల్ని అంగీకరించాలి అనే నిబంధన ఏమీ లేదు. లేదు అతడు "ఇతడు పనికిమాలిన వాడు , నేను ఇతన్ని అంగీకరించను,"అని భావిస్తే అతను మిమ్మల్ని తిరస్కరించవచ్చు.

అందువలన అతను తన సొంత వ్యక్తిత్వాన్ని కలిగివున్నాడు, మీకూ ఒక వ్యక్తిత్వం వుంది, ప్రతి ఒక్కరూ వారివారి వ్యక్తిత్వాన్ని కలిగివున్నారు. నిరాకారవాదం అనే ప్రశ్న ఎక్కడ ఉంది? అవకాశమే లేదు. మీరు కృష్ణుడిని నమ్మకపోతే, మీరు వేదాలను నమ్మరు, ఏది ఏదైన, కృష్ణుడు పరమ ప్రామాణీకునిగా, దేవాదిదేవునిగా అంగీకరించబడ్డాడు. కాబట్టి మనము అతనిని నమ్మకపోతే, జ్ఞానములో ఉన్నతి పొందే అవకాశం ఎక్కడ ఉంది? దానికి అవకాశమే లేదు. వ్యక్తిత్వం గురించిన సందేహమే అవసరం లేదు. ఇది ప్రామాణిక ప్రకటన. ఇప్పుడు, ప్రామాణిక ప్రకటనను ప్రక్కనపెడితే , మీరు మీ కారణాలు మరియు వాదనలతో సత్యాన్ని దర్శించవచ్చు. రెండు పక్షల మధ్య ఎక్కడైన వెంటనే ఒప్పందం కుదిరినట్లు మీరు చెప్పగలరా? లేదు. మీరు వెళ్ళి అధ్యయనం చేయండి,రాష్ట్రంలో, కుటుంబంలో, సమాజంలో, దేశంలో,అలా ఒప్పందం కుదరలేదు. అసెంబ్లీలో కూడ, మీ దేశంలో కూడా. ఉదాహరణకు ప్రణాళికా సదస్సు ఉంది అనుకుందాం, అందులో ప్రతి ఒక్కరూ దేశం యొక్క మంచికోసం పాటుపడతారు, కానీ ప్రతి ఒక్కరూ తన సొంత వ్యక్తిగతరీతిలో ఆలోచిస్తారు. నా దేశం యొక్క సంక్షేమం ఈ దారిలో ఉంటుంది అని ఒకరు ఆలోచిస్తుంటారు. లేకపోతే, అధ్యక్ష ఎన్నికల సమయంలో పోటీ ఎందుకు జరుగుతుంది? అందరూ అంటున్నారు "అమెరికాకు నిక్సన్ అవసరం."అని మరియు మరొక వ్యక్తి, అతను కూడా, "అమెరికాకు నేను అవసరం."అంటాడు. కాబట్టి, ఎందుకు రెండు? అమెరిక అనే ఒకటి , మీరు కూడా ఆ ఒకటేనా ... కాదు మీకు వ్యక్తిత్వం ఉంది. మిస్టర్ నిక్సన్ అభిప్రాయం ఒకటి. మరొక అభ్యర్థి అభిప్రాయం మరొకటి. అసెంబ్లీలో, సెనేట్లో, కాంగ్రెస్ లో, ఐక్యరాజ్యసమితిలో, ప్రతి ఒక్కరూ తన వ్యక్తిగత అభిప్రాయలతో పోరాడుతున్నారు. లేకపోతే ఎందుకు ప్రపంచంలో చాలా జెండాలు ఎందుకు ఉంటాయి? మీరు ఎక్కడైన నిరాకారత్వాన్ని గమనించలేరు. వ్యక్తిత్వం అనేది ప్రతిచోట ముఖ్య అంశంగా ఉంది. ప్రతిచోట వ్యక్తిత్వం, సొంత వ్యక్తిత్వం, ప్రధానంగా ఉంది. కాబట్టి మనము అంగీకరించాలి. మనము మన కారణలను ప్రతిపాదించో, వాదనలు చేసో, ప్రామాణికాన్ని అంగీకరించాలి. అప్పుడు ప్రశ్న పరిష్కరించ బడుతుంది. లేకపోతే అది చాలా కష్టము.