TE/Prabhupada 0441 - కృష్ణుడు సర్వోన్నతుడు మరియు మనము ఆయన విభిన్న అంశలము



Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968


భక్తుడు: "భగవంతుడు సర్వోన్నతమైన వ్యక్తి, అర్జునుడు భగవంతుని యొక్క శాశ్వత సహచరుడు, మరియు అక్కడ సమావేశమయిన రాజులందరూ ఎవరికివారు వ్యక్తిగత వ్యక్తులు. దాని అర్థం వారు గతంలో వ్యక్తిగతంగా లేని సమయం లేదు అని, మరియు వారు శాశ్వతమైన వ్యక్తులుగా ఉండని సమయం ఉండబోదు. గతంలో వారి వ్యక్తిత్వం నిలిచివుంది .మరియు వారి వ్యక్తిత్వం అంతరాయం లేకుండా భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. అందువల్ల వ్యక్తిగత జీవుల్లోని ఏ ఒక్కరికీ విచారించడానికి ఏ కారణం లేదు. మాయావాద లేదా నిరాకారవాద సిద్ధాంతాల ప్రకారం మోక్షం పొందిన తర్వాత వ్యక్తిగత ఆత్మ , మాయా లేదా భ్రాంతి తెరచే వేరుచేయబడి, వ్యక్తిగత మనుగడ లేకుండా నిరాకార బ్రహ్మంలో విలీనం అవుతుంది అని ... "

ప్రభుపాద: ఇప్పుడు, మాయావాదులు ఈ వ్యక్తిత్వాన్ని మాయ అని చెబుతున్నారు. వారి ఉద్దేశం ప్రకారం ఆత్మ, మొత్తం ఆత్మ ఒక ముద్ద అని. వారి సిద్ధాంతం ఘఠాకాశ పొఠాకాశ. ఘఠాకాశ పొఠాకాశ అంటే ... ఆకాశం లాగా ఉంటుంది అని. ఆకాశం అనేది ఒక విస్తారం. ఒక నిరాకార విస్తారం. ఒక కుండ లో, ఒక నీళ్ళ కుండలో, మూసిన ఒక మట్టి కడవ లో ... ఇప్పుడు, కడవ లోపల, అక్కడ కూడా ఆకాశం ఉంది,ఒక చిన్న ఆకాశం. ఇప్పుడు ఎప్పుడైతే కడవ పగిలిపోతుందో అప్పుడు, కడవ వెలుపల, పెద్ద ఆకాశం, మరియూ కడవ లోని చిన్న ఆకాశం రెండూ కలిసి ఏకమవుతాయి . అదే మాయావాద సిద్ధాంతం. కానీ ఈ ఉపమానం సరైనదికాదు. ఉపమానం అంటే సరూప్యత యొక్క అంశాలు. అది సరూప్యపు చట్టం. ఆకాశాన్ని ఆవిధంగా పోల్చలేము... మట్టి కడవ లోపల చిన్న ఆకాశాన్ని జీవునితో పోల్చడానికి లేదు. ఇది పదార్థం, భౌతికమైనది. ఆకాశం భౌతికమైనది, మరియు వ్యక్తిగత జీవి ఒక ఆత్మ. కాబట్టి ఆ ఉపమానం సరైనదని మీరు ఎలా చెప్పగలరు? ఉదాహరణకు, ఒక చిన్న చీమను తీసుకుంటే , అది జీవాత్మ. అది దానికి తగ్గ వ్యక్తిత్వాన్ని కలిగివుంది. కానీ ఒక గొప్ప నిర్జీవమైన రాతి పదార్థం, కొండ లేదా పర్వతం, దానికి ఏ వ్యక్తిత్వం లేదు. కాబట్టి భౌతికపదార్థానికి ఏ వ్యక్తిత్వం లేదు. ఆత్మ వ్యక్తిత్వాన్ని కలిగివుంటుంది సరూప్యత యొక్క అంశాలు విభిన్నంగా ఉంటే, అప్పుడు ఉపమానం వర్తించదు. అది సరూప్యపు చట్టం. మీరు భౌతికమైన జడపదార్థం మరియు ఆత్మ రెండింటి మద్య ఉపమానాన్ని ఇవ్వలేరు. కాబట్టి ఇది లేనిపోని ఉపమానం. ఘఠాకాశ పొఠాకాశ. ఇందుకు భగవద్గీతలో మరోక సాక్ష్యం ఉంది. కృష్ణుడు ఇలా చెప్పాడు mamaivāṁśo jīva-bhūta ( BG 15.7) వ్యక్తిగత జీవులు ,వారందరూ నా యొక్క అంశలు. Jīva-loke sanātanaḥ. మరియు వారు శాశ్వతమైనవారు. అంటే దాని అర్థం వారు భగవంతుని శాశ్వత అంశలు అని . తర్వాత ఎప్పుడైతే... ఈ మాయావాద సిధ్ధాంతం ఎలా మద్దతు అందుకుంటోంది,మాయ కారణంగా మాయ ఆఛ్ఛాదన కారణంగా, వారు ఇప్పుడు వ్యక్తిగతులుగా,విభజించబడి వున్నారు. కానీ మాయ యొక్క ఆఛ్ఛాదన తీసివేయబడినప్పుడు, వారు మట్టి కడవ లోపలి చిన్న ఆకాశం,బయటవున్న పెద్ద ఆకాశం కలిసిపోయినట్లు కలగలిపి ఉంటారా? ఈ సారూప్యత తార్కిక దృక్పథం ప్రకారం లేనిపోనిది, అలాగే ప్రామాణికమైన వైదిక సూత్రాలను అనుసరించి. వారు భగవంతుని శాశ్వత అంశలు. భగవద్గీత నుండి అనేక ఇతర ఆధారాలు ఉన్నాయి. భగవద్గీత ఆత్మ విభజింపరానిదని చెబుతోంది. దానినిబట్టి మాయ ఆఛ్ఛాదన కారణంగానే ఆత్మ విభజించబడి వుందని చెబితే అది సాధ్యం కాదు. ఆత్మను ఖండించడం సాధ్యం కాదు. మీరు ఒక పెద్ద కాగితాన్ని చిన్నచిన్న కాగితపు ముక్కలుగా కత్తిరించవచ్చును. అది సాధ్యమే, ఎందుకంటే కాగితం అనేది భౌతిక పధార్థం.కానీ ఆధ్యాత్మిక అంశ విషయంలో అది సాధ్యం కాదు. ఆధ్యాత్మికంగా, శాశ్వతంగా, అంశలు అంశలే,మరియు దేవదిదేవుడే పరిపూర్ణుడు. కృష్ణుడు పరిపూర్ణుడు, మరియు మనము విభిన్న అంశలం. మనము శాశ్వతమైన అంశలము. ఈ విషయలు భగవద్గీతలో వివిధ చోట్ల చాలా చక్కగా వివరించబడ్డాయి. ఈ భగవద్గీత యొక్క ఒక నకలును ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉంచుకొమ్మని నేను మిమ్మల్ని కోరుతున్నాను, మీలో ప్రతి ఒక్కరూ,దానిని సావధానంగా చదవండి. మరియు వచ్చే సెప్టెంబర్లో పరీక్ష జరుగుతుంది. కాబట్టి... వాస్తవానికి, అది పరీక్ష స్వచ్ఛందంగానే వుంటుంది. కానీ రాబోయే సెప్టెంబరు పరీక్ష కోసం సిద్ధంగా వుండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరియు పరీక్షలో ఉత్తీర్ణుత సాధించినవారు భక్తి-శాస్ర్తి అనే బిరుదును పొందుతారు. మీరు దానిని వితరణ చేశారా ... సరే. కొనసాగించు.

భక్తుడు: "ఇక్కడ కేవలం బధ్ధ స్థితిలోనే మనం వ్యక్తిత్వం కల్గివుంటామనే సిధ్ధాంతం త్రోసిపుచ్చబడలేదు. భవిష్యత్తుతులో కూడ భగవంతుని యొక్క మరియు ఇతరుల వ్యక్తిత్వం అలానే నిలిచివుంటుందని కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు ... "

ప్రభుపాద: ముక్తి పొందిన తరువాత ఈ వ్యక్తిగత ఆత్మలు సర్వోన్నత ఆత్మతో కలిసిపోతాయి అని కృష్ణుడు ఎప్పుడూ చెప్పలేదు. కృష్ణుడు ఆవిధంగా భగవద్గీతలో ఎప్పుడూ చెప్పలేదు.