TE/Prabhupada 0449 - భక్తి ద్వార, మీరు దేవదిదేవుడిని నియంత్రించవచ్చు. అది మాత్రమే మార్గం



Lecture on SB 7.9.3 -- Mayapur, February 17, 1977


బ్రహ్మ, భగవంతుడు బ్రహ్మ, అతను ఈ విశ్వంలో మొదటి జీవి. లక్ష్మి దేవి భయపడినది; బ్రహ్మ కూడ చాల భయపడ్డాడు. అందువలన బ్రహ్మ, ప్రహ్లాద మహారాజును కోరారు నా ప్రియమైన కుమారుడా, ముందుకు వెళ్ళు , భగవంతుని శాంత పరుచు. నీవు చేయగలవు, ఎందుకంటే అతను నీ కోసం ఈ భయంకరమైన రూపములో ఆవిర్భవించారు. మీ తండ్రి అతనికి చాలా కోపము తెప్పించాడు నిన్ను చాలా విధాలుగా భాధపెట్టడము ద్వారా, నిన్ను శిక్షించడం ద్వారా, ఇబ్బందుల్లోకి నెట్టడము ద్వారా. అందువలన ఆయన చాలా కోపంగా ఆవిర్భవించారు. నీవు ఆయనను శాంత పరుచు. మా వల్ల కాదు. ఇది సాధ్యం కాదు." Prahlāda preṣayām āsa brahma avasthita antike. ప్రహ్లాద మహారాజు, చాలా ఉన్నతమైన భక్తుడు, అతను భగవంతుడిని శాంత పరిచారు. Bhaktyā, భక్తి ద్వార, మీరు దేవదిదేవుడిని నియంత్రించవచ్చు. అది మాత్రమే మార్గం. Bhaktyā maṁ abhijānāti ( BG 18.55) భక్తి ద్వారానే అవగాహన ఉంటుoది, భక్తి ద్వారా మీరు దేవుణ్ణి నియంత్రించవచ్చు. Vedeṣu durlabham adurlabha ātmā-bhaktau. వేదాలను అధ్యయనం చేయడం ద్వారా మీరు దేవుణ్ణి అర్థం చేసుకోలేరు. Vedeṣu durlabham adurlabha ātmā-bhaktau. కానీ ఆయన భక్తులకు, అతను చాలా సులభముగా అందుబాటులో ఉంటాడు. అందువలన భక్తి మాత్రమే మూలం. Bhaktyām ekayā grāhyam భక్తి ద్వారా మాత్రమే మీరు సమీపించవచ్చు, మీరు దేవుడితో, సమాన స్థాయిలో మిత్రుడి వలె మాట్లాడవచ్చు గోప బాలురు, వారు కృష్ణుడిని తమతో సమానముగా భావించారు. "కృష్ణుడు మనలాగా ఉన్నాడు." కానీ వారు కృష్ణుడిని చాలా,చాలా తీవ్రముగా ప్రేమించినారు. అది వారి అర్హత. అందువలన కృష్ణుడు కొన్నిసార్లు అతని భుజంపై గోప బాలురను ఎక్కించుకోవటానికి అంగీకరించారు. అందుకే ... కృష్ణుడు కోరుకుంటున్నాడు, "నా భక్తా ... నా భక్తుడిగా ఉండు నన్ను నియంత్రించు. ప్రతి ఒక్కరూ భయము, గౌరవముతో నాకు పూజలు చేస్తారు ఎవరైన నన్ను నియంత్రించుటకు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. " అది ఆయన కోరుకుంటున్నారు. అందువల్ల అతను తనను నియంత్రించటానికి యశోదమాతను అంగీకరించారు. దేవుడు ఎలా నియంత్రించబడతాడు? Īśvaraḥ parama kṛṣṇḥ (Bs 5.1). అతను సర్వోన్నతమైన నియంత్రికుడు. ఎవరు ఆయనను నియంత్రిస్తారు? ఇది సాధ్యం కాదు. కానీ ఆయన తన పవిత్రమైన భక్తుడుచే నియంత్రించబడటానికి అంగీకరించారు. అతను అంగీకరించారు, " సరే అమ్మ, నీవు నన్ను నియంత్రిoచవచ్చు, నీవు నన్ను కట్టి వేయి. నీవు నీ కర్రను చూపించు , దాని వలన నేను భయపడ్డవచ్చు. "

ప్రతిదీ ఉంది. దేవుడు సున్న అని అనుకోవద్దు, లేదు, śūnyavādi. ఆయన ప్రతిదీ . Janmādy asya yataḥ ( SB 1.1.1) Athāto brahma jijñāsā. మీరు బ్రహ్మణ్ గురించి ప్రశ్నిస్తున్నారు. Paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān ( BG 10.12) కావున కోపం ఉండాలి, దేవుడు ఎల్లప్పుడూ శాంతముగా ఉంటాడు అని కాదు కానీ తేడా ఆయన కోపం, ఆయన శాంత వైఖరి ఒక్కటే ఫలితమును ఇస్తాయి. ప్రహ్లాద మహారాజు, ఒక భక్తుడు... అతను ప్రహ్లాద మహారాజుతో చాలా సంతృప్తి చెందాడు, అతను ఆతని తండ్రితో చాల అసంతృప్తిగా ఉన్నాడు, కానీ ఫలితం ఒక్కటే: వారు ఇద్దరికి విముక్తి లభించినది. భక్తుడు సహచరుడు అయినప్పటికీ, అయితే దేవుడి చేత చంపబడిన రాక్షసుడు, అతను ఒక సహచరుడు కాడు - అతనికి అర్హత లేదు - కానీ అతను ఆధ్యాత్మిక రాజ్యం లోకి ప్రవేశిస్తాడు. అతను ఈ భౌతిక బoధనము నుండి విముక్తి పొందుతాడు. ఒక భక్తుడు అదే స్థానాన్ని ఎందుకు తీసుకోవాలి? అందువలన, māṁ eti. Tato māṁ tattvato jñātvā viśate tad-anantaram ( BG 18.55) వారు viśate ఆధ్యాత్మిక రాజ్యంలోకి ప్రవేశిస్తారు, ప్రవేశిస్తారు. విముక్తి పొందిన ప్రతి ఒక్కరు. అతను ప్రవేశిస్తాడు.

brahma-bhūtaḥ prasannātmā
na śocati na kāṅkṣati
samaḥ sarveṣu bhūteṣu
mad-bhaktiṁ labhate...
(BG 18.54)

కానీ ఎవరైతే భక్తులో, వారు లోకములోకి ప్రవేశించడనికి అనుమతి పొంది ఉంటారు, వైకుoఠ లోకము లేదా గోలోక వృందవన లోకములోకి. ఈ విధంగ జీవులు తమ వాస్తవ స్థానమునకు వస్తారు. కానీ మనము భక్తిని తీసుకోకపోతే, మనము బ్రహ్మణ్ తేజస్సులోకి ప్రవేశించవచ్చు, కానీ క్రింద పడిపోవడానికి అవకాశం ఉంది. Āruhya kṛcchreṇa paraṁ padaṁ tataḥ patanty adho 'nādṛta-yusmad-aṅghrayaḥ ( SB 10.2.32) ఎవరైతే నిరాకారవాదులో, వారు ఆధ్యాత్మిక రాజ్యంలోకి ప్రవేశించవచ్చు. దీనిని paraṁ padaṁ అని పిలుస్తారు. Padaṁ padaṁ yad vipadāṁ na teṣām ( SB 10.14.58) కానీ పతనానికి అవకశం కూడ ఉంది. Āruhya kṛcchreṇa తీవ్రమైన ప్రాయశ్చిత్తములు మరియు తపస్సుల తరువాత బ్రహ్మణ్ తేజస్సులోకి ప్రవేశించవచ్చు. కానీ అతనికి paraṁ padaṁ యొక్క సమాచరము తెలిస్తే తప్ప - samāśritā ye pada pallava plavam - క్రింద పడిపోయే అవకాశం ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో bhūtvā bhūtvā pralīyate ( BG 8.19) ఉంది

కానీ ఆధ్యాత్మికంలో కూడ, మీరు ఆధ్యాత్మిక రాజ్యములో ప్రవేశిస్తే, అక్కడ నుండి కూడ, కొన్నిసార్లు ఇది జరుగుతుంది. అయితే అది దేవుడు కోరిక వలన. ఉదాహరణకు జయ-విజయులు లాగానే. వారు వ్యక్తిగత సహచరులు. కానీ వివరణ ఏమిటంటే కృష్ణుడు కోరుకున్నాడు "వారు వెళ్ళాలి ..., Hiraṇyakaśipu ..., ఈ ఇద్దరు, జయ-విజయ, వారు భౌతిక ప్రపంచానికి వెళ్ళాలి, నేను వారితో పోరాడాలి. " ఎందుకంటే ఆ పోరాటము, కోపముగా ఉండడానికి, ఆ ధోరణి ఉంది. ఎక్కడ ప్రదర్శిస్తాడు? వైకుంఠములో ఈ కోపం , పోరాటము ప్రదర్శించటానికి అవకాశం లేదు. అది సాధ్యము కాదు. అందువలన అతను తన భక్తుడిని ప్రేరేపిస్తున్నాడు భౌతిక ప్రపంచానికి వెళ్లి, నా శత్రువుగా మారండి, నేను పోరాడతాను. నేను కోపము తెచ్చుకుంటాను , "ఎందుకంటే వైకుంఠములో, ఆధ్యాత్మిక రాజ్యం, అవకాశం లేదు. అందరూ సేవ చేస్తున్నారు; అందరూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఏదో ఒక్క సంబంధములో ... పోరాటము అనే ప్రశ్న ఎక్కడ ఉంటుoది? కానీ పోరాట స్పూర్తి ఉంది; కోపం ఉంది. ఎక్కడ ఆయన ప్రదర్శిస్తాడు? అందువలన కృష్ణుడు అవతారం తీసుకుంటారు, అతను కోపము తెచ్చుకుంటారు, భక్తుడు శత్రువు అవుతాడు, ఇది కృష్ణ-లీల, నిత్య -లీల. ఇది జరుగుతూ ఉంటుంది

ధన్యవాదాలు.

భక్తులు: జయ!హరి బోల్!