TE/Prabhupada 0450 - భక్తియుక్త సేవలను నిర్వర్తించటములో ఏటువంటి భౌతిక కోరికలను తీసుకు రావద్దు



Lecture on SB 7.9.4 -- Mayapur, February 18, 1977


ప్రద్యుమ్న: అనువాదము - "నారద ముని కొనసాగించారు: ఓ రాజా, ఉన్నతమైన భక్తుడు అయినప్పటికీ ప్రహ్లాద మహారాజు కేవలం చిన్న పిల్లవాడు, అతను భగవంతుడు బ్రహ్మ యొక్క ఉపదేశాలు అంగీకరించారు. అతను క్రమంగా భగవంతుడు నరసింహస్వామి దగ్గరకు వెళ్ళి, అతను నేలపై పడుకొని మర్యాదపూర్వకముగా ముడిచిన చేతులతో ప్రణామములు అర్పించారు. "

ప్రభుపాద:

tatheti śanakai rājan
mahā-bhāgavato 'rbhakaḥ
upetya bhuvi kāyena
nanāma vidhṛtāñjaliḥ
(SB 7.9.4)

ప్రహ్లాద మహారాజు మహా-భాగవతుడు,సాధారణ భక్తుడు కాదు. Arbhakaḥ. Arbhakaḥ అంటే అమాయక బాలుడు, ఐదు సంవత్సరాల చిన్న బాలుడు. కానీ మహా-భాగవతుడు. ఎందుకంటే అతను బాలుడు కనుక, కాదు ... Ahaituky apratihatā ( SB 1.2.6) ఒక చిన్న పిల్లవాడు మహా-భాగవతుడు అవ్వవచ్చు, బాగా జ్ఞానవంతుడైన పండితుడు ఒక రాక్షసుడు అవ్వవచ్చు. భక్తి చాలా ఉన్నతమైనది , అందువలనే ఇవి విరుద్ధమైనవిగా ఉన్నాయి . Arbhakaḥ. అర్బక అంటే మూర్ఖుడు లేదా పిల్లవాడి చేష్టలు, కానీ అదే సమయంలో మహా-భాగవతుడు. అది సాధ్యమే. మహా-భాగవతుడు అంటే ... వివిధ రకముల భక్తుల మధ్య మనము వ్యత్యాసము గుర్తించాలి: kaniṣṭha adhikārī, madhyama-adhikārī and mahā-bhāgavata, uttama adhikārī. Uttama-adhikārī..

ఈ ప్రహ్లాద మహారాజు , మహా-భాగవతుడు, అతనికి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నాయి అని కాదు ... కాదు. అతను తన తల్లి యొక్క గర్భంలో నుండి మహా- భాగవతుడు అతని తల్లి దేవతలచే దాడి చేయబడినప్పుడు, బంధించి, దేవతలు ఈడ్చుకు వెళ్ళుతున్నప్పుడు నారద ముని అక్కడ వెళ్ళుతున్నాడు: "మీరు ఏమి చేస్తున్నారు?" "ఆమె హిరణ్యకశిపుని భార్య, ఆమె గర్భంలో ఒక పిల్ల వాడిని కలిగి ఉంది. కావున ఆ పిల్లవాడిని కూడా చంపాలని మనము కోరుకుంటున్నామా." నారద ముని వెంటనే వారిని, "లేదు, లేదు, లేదు, లేదు, అతను సాధారణ పిల్లవాడు కాదు. అతను మహా-భాగవతుడు. తాకవద్దు. " కావున వారు అంగీకరించారు. నారద ముని ... వీరు దేవతలు. కొంత పొరపాటు చేసినప్పటికీ, నారద ముని వారిని ఆదేశించిన వెంటనే హాని చేయడానికి ప్రయత్నించవద్దు. అతను మహా-భాగవతుడు, వెంటనే... నారద ముని ఇలా అన్నాడు, "నా ప్రియమైన కుమార్తె, నీ భర్త తిరిగి వచ్చే వరకు నీవు నాతో రా." హిరణ్యకశిపుడు దేవతలను ఓడించడానికి చాలా తీవ్రముగా తప్పస్సులను నిర్వహించడానికి వెళ్ళాడు. ఇది రాక్షస్సుల యొక్క తపస్సు. చాలా తీవ్రమైన తపస్సులో హిరణ్యకశిపుడు నిమగ్నమై ఉన్నాడు. ప్రయోజనము ఏమిటి? కొంత భౌతిక ప్రయోజనము.

కానీ ఆ రకమైన తపస్సు, తపస్య, నిరుపయోగం. Śrama eva hi kevalam ( SB 1.2.8) భౌతిక వ్యక్తులము, వారు తపస్సులు తీసుకుంటారు. వారు అలా చేయకపోతే, వారు వ్యాపార రంగములో లేదా ఆర్థిక రంగములో లేదా రాజకీయ రంగములో మెరుగుపడరు. వారు చాలా కష్టపడి పని చేస్తారు.మనదేశములో లాగనే, గొప్ప నాయకుడు మహాత్మ గాంధీ, అతను చాలా చాలా కష్టపడి పని చేసారు. డర్బన్లో ఇరవై సంవత్సరాలు , భారతదేశములో ముప్పై సంవత్సరాలు అతను తన సమయాన్ని వృధా చేశాడు. నేను తన సమయన్ని వృధా చేశాడు అని చెప్పుతున్నాను. దేని కోసం? కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం. అతని రాజకీయ ప్రయోజనము ఏమిటి? "ఇప్పుడు మనము భారతీయులము అనే పేరుతో పిలవబడే సమాజము. మనము ఆంగ్లేయులను వెళ్ళగొట్టి, మనము అధికారాన్ని తీసుకోవాలి. "ఇది అతని ఉద్దేశ్యము. ఇది anyābhilāṣitā-śūnyaṁ ( CC Madhya 19.167) ఈ ప్రయోజనము ఏమిటి? ఈ రోజు మీరు భారతీయులు; రేపు మీరు ఏదో కావచ్చు. Tathā dehāntara-prāptiḥ ( BG 2.13) మీరు మీ శరీరాన్ని మార్చుకోవాలి. తదుపరి శరీరం ఏమిటి? మీరు మళ్ళీ భారతీయులు అవ్వుతారా? హామీ లేదు. మీరు భారతదేశము మీద చాలా ప్రేమ కలిగి ఉన్నా, అది సరే, మీ కర్మ ప్రకారం, మీరు శరీరమును పొందుతారు మీరు భారత దేశములో ఒక చెట్టు శరీరాన్ని పొందినప్పటికీ, అప్పుడు మీరు ఐదు వేల సంవత్సరాల పాటు నిలబడతారు. ప్రయోజనము ఏమిటి? కృష్ణుడు చెప్పుతాడు tathā dehāntara-prāptiḥ. అతను ఒక మానవుడు మళ్లీ మానవుడిగా పుడతాడు అని చెప్పలేదు. హామీ లేదు. ఎవరో దుష్టులు వారు చెప్పుతారు, ఈ మానవ శరీరాన్ని ఒక్కసారి పొందినప్పుడు, అతను అధోగతి చెందడు. కాదు అది వాస్తవము కాదు. వాస్తవము ఏమిటంటే 8,400,000 మంది వివిధ జీవన జాతులలో, మీ కర్మ ప్రకారము మీరు శరీరాన్ని పొందుతారు. అంతే. మీకు హామీ లేదు మీకు ఉంది అని... భారతీయుడి శరీరము మీకు వచ్చినా కూడా, ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకుంటారు?

కృష్ణ చైతన్యము లేకుండా, ఏ తప్పస్సులను మనము పాటించినా, ఇది కేవలం సమాయన్ని వృధా చేసుకోవడము. మనము తెలుసుకోవాలి. కేవలం సమయం వృధా చేసుకోవడము. మీరు మీ శరీరాన్ని మార్చుకున్నారు కనుక, అంతా మార్చబడుతుంది. మీరు నగ్నంగా వచ్చారు. మీరు నగ్నంగా వెళ్ళాలి. మీరు ఏ ప్రయోజనము పొందలేరు. Mṛtyuḥ sarva-haraś cāham ( BG 10.34) Sarva-haraś ca. మీరు ఏమి సంపాదించిన, ప్రతిదీ తీసివేసుకోబడుతుంది. మృత్యు... హిరణ్యకశిపుని వలె. హిరణ్యకశిపుడు, అతను సంపాదించినది అంతా, ప్రహ్లాద మహారాజు అన్నాడు, ఒక్క క్షణములో, మీరు తీసుకున్నారు. నా ప్రభు, నీవు ఎందుకు నాకు ఈ భౌతిక వరములు ఇస్తున్నావు? దాని వలన విలువ ఏమిటి? నేను నా తండ్రిని చూశాను: తన కనుబొమ్మలలో మెరుపు ద్వారా దేవతలు భయపడే వారు అటువంటి పరిస్థితిని, మీరు ఒక్కక్షణములో పూర్తి చేశారు. ఈ భౌతిక స్థితి వలన ఉపయోగం ఏమిటి? "

పవిత్రమైన భక్తులు ఎవరైతే ఉంటారో, వారు, వారు ఏదైన భౌతిక వస్తువులను కోరుకోరు. అది వారి విధానము కాదు ...

anyābhilāṣitā-śūnyaṁ
jñāna-karmādy-anāvṛtam
ānukūlyena kṛṣṇānu-
śīlanaṁ bhaktir uttamā
(Brs. 1.1.11)

మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. భక్తియుక్త సేవలను నిర్వర్తించటములో ఏటువంటి భౌతిక కోరికలను తీసుకు రావద్దు. అప్పుడు అది పవిత్రమైనది కాదు. Na sādhu manye yato ātmano 'yam asann api kleśada āsa deha. భౌతిక కోరికలను మీరు తీసుకు వచ్చిన వెంటనే, మీరు మీ సమయాన్ని వృధా చేసుకుoటున్నారు. ఎందుకంటే మీరు మరల ఒక శరీరమును పొందవలసి ఉంటుంది. మీ కోరిక నెరవేరుతుంది. కృష్ణుడు చాలా దయ కలిగిన వాడు - ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmi ( BG 4.11) మీరు భక్తి ద్వారా కొన్ని కోరికలను నెరవేర్చుకోవాలని కోరుకుంటే, కృష్ణుడు చాలా దయ కలిగిన వాడు: "సరే" కానీ మీరు మరొక శరీరాన్ని తీసుకోవాలి. మీరు పవిత్రముగా ఉంటే, సరళముగా, tyaktvā dehaṁ punar janma naiti mām eti ( BG 4.9) ఇదికావాలి. శుద్ధ భక్తుడు . అందువల్ల ప్రతిఒక్కరూ పవిత్రమైన భక్తుడు కావాలని మనము ప్రతి ఒక్కరికీ సలహా ఇస్తున్నాము. పవిత్రమైన భక్తుడు ... ఇది ఉదాహరణ, మహా-భాగవతుడు. ఈ ఐదు-సంవత్సరాల బాలుడు, అతను కృష్ణుడి యొక్క పవిత్రమైన భక్తుడు కావాలనే కోరిక తప్ప మరే పనిని కలిగి లేడు