TE/Prabhupada 0583 - ప్రతి విషయము భగవద్గీతలో ఉంది



Lecture on BG 2.21-22 -- London, August 26, 1973


అందువలన భగవంతుని సేవకుని ద్వారా మొత్తం విశ్వము నిర్వహించబడుతుంది. బ్రహ్మ ప్రకారము, బ్రహ్మ అత్యంత శక్తివంతమైన సేవకుడు. Tene brahma hṛdā ya ādi-kavaye muhyanti yat sūrayaḥ ( SB 1.1.1) బ్రహ్మ యొక్క హృదయంలో కూడా, తేనే బ్రహ్మ హృదా, హృదా, మళ్ళీ హృదా . ఎందుకనగా బ్రహ్మ ఒంటరిగా ఉన్నాడు, కాబట్టి ఏమి చేయాలి? బ్రహ్మ కలవరపడ్డాడు. కానీ కృష్ణుడు ఆదేశాన్ని ఇచ్చాడు, "నీవు ఈ విధంగా విశ్వమును సృష్టించు." బుద్ధి -యోగ దదామి తమ్, "నేను బుద్ధిని ఇస్తాను." కాబట్టి ప్రతిదీ ఉంది. అంతా ఉంది, కృష్ణుడు నీతోనే ఉన్నాడు. మీరు తిరిగి ఇంటికి వెళ్లాలని అనుకొంటే, భగవద్ధామము, అప్పుడు కృష్ణుడు మీకు అన్ని సూచనలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, yena mām upayānti te. ఆయన బోధిస్తాడు, "అవును, నీవు ఇలా చేయుము. అప్పుడు నీవు ఈ భౌతిక పనులను పూర్తి చేస్తావు, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు నా దగ్గరకు వస్తావు." కానీ మీరు ఈ భౌతిక జీవితముని కొనసాగించాలని కోరుకుంటే, అప్పుడు vāsāṁsi jīrṇāni yathā vihāya ( BG 2.22) మీరు ఒక శరీరం అంగీకరించాలి; మరియు ఇది ఇంక ఉపయోగకరంగా లేనప్పుడు, అప్పుడు మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని అంగీకరించాలి. ఇది భౌతిక జీవితము యొక్క కొనసాగింపు. కానీ మీరు దానిని ముగించాలని కోరుకుంటే, మీరు ఈ రకమైన పనులతో అసహనముగా ఉంటే, bhūtvā bhūtvā pralīyate ( BG 8.19) మళ్లీ జన్మించి, మళ్లీ చనిపోయి, మళ్లీ తీసుకోవాలి. కానీ మనము సిగ్గులేకుండా మరియు చాలా పనికిమాలిన పనులను చేస్తూ వుంటాము. అది మనము ఈ పనులను పెద్దగా అసహ్యించుకోవట్లేదు. మనము కొనసాగించాలనుకుంటున్నాము, అందువలన కృష్ణుడు కూడా సిద్ధంగా ఉన్నాడు: "సరే, నీవు కొనసాగుము." ఇది భగవద్గీతలో చెప్పబడింది, yantrārūḍhāni māyayā.

īśvaraḥ sarva-bhūtānāṁ
hṛd-deśe 'rjuna tiṣṭhati
bhrāmayan sarva-bhūtāni
yantrārūḍhāni māyayā
(BG 18.61)

చాలా స్పష్టంగా. కృష్ణునికి మీ కోరిక తెలుసు, అది మీరు ఇప్పటికీ ఈ భౌతిక ప్రపంచాన్ని ఆనందించాలనుకుంటే, "సరే, ఆనందించండి." కాబట్టి వివిధ రకాలైన ఆనందాన్ని అనుభవించడానికి, మనకు వివిధ రకాల సాధనాలు అవసరమవుతాయి. కాబట్టి మీకోసం కృష్ణుడు సిద్ధం చేశాడు, చాలా దయగలవాడు, "సరే" . ఉదాహరణకు తండ్రి బొమ్మను ఇస్తాడు, పిల్లవాడికి మోటారు కారు కావాలి. సరే, ఒక బొమ్మ మోటార్ కారు తీసుకోండి. ఆయన ఇంజిన్ కావాలని కోరుకున్నాడు, ఆయన రైల్వే వ్యక్తి కావాలనుకున్నాడు. ఇప్పుడు ఇట్టి రకాల బొమ్మలు ఉన్నాయి. అదేవిధముగా కృష్ణుడు ఈ బొమ్మల శరీరాలను సరఫరా చేస్తున్నాడు. యంత్ర , యంత్ర అంటే యంత్రం. ఇది ఒక యంత్రం. ఇది ఒక యంత్రం అని అందరూ అర్థం చేసుకున్నారు. కాని యంత్రాన్ని ఎవరు సరఫరా చేశారు? యంత్రం ప్రకృతి ద్వారా సరఫరా చేయబడుతుంది, భౌతిక పదార్థాలు, కానీ ఇది కృష్ణుని ఆజ్ఞానుసారం తయారు చేయబడుతుంది. Mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram ( BG 9.10) ప్రకృతి, ప్రకృతి, నా ఆదేశానుసారం ఈ అంశాలన్నీ సిద్ధం చేస్తోంది.

కాబట్టి కృష్ణ చైతన్యమును అర్థం చేసుకోవడంలో కష్టమెక్కడుంది? అంతా భగవద్గీతలో ఉంది. మీరు శ్రద్ధగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీరు ఎల్లవేళలా కృష్ణ చైతన్యంతో ఉంటారు. అంతా ఉంది. నా పరిస్థితి ఏమిటి, నేను ఎలా పని చేస్తున్నాను, ఎలా చనిపోతున్నాను, నేను ఎలా శరీరాన్ని పొందుతున్నాను, నేను ఎలా తిరుగుతున్నాను. అంతా వివరంగా అక్కడ ఉంది. కేవలం కొంచెం తెలివైన వ్యక్తిగా మారాలి. కానీ మనము తెలివిలేని, మూర్ఖులుగా ఉండిపోయాము, ఎందుకనగా మనము మూర్ఖులుతో సహవాసం చేస్తున్నాము. ఈ మూర్ఖ తత్వవేత్త, మతాధికారులు, అవతార, భగవాన్, స్వామి, యోగులు, కర్మ వాదులు. కాబట్టి మనం మూర్ఖులుగా మారాము. Sat- chāḍi kainu asate vilāsa. కాబట్టి నరోత్తమ దాస ఠాకురా ఇలా విచారం వ్యక్తం చేశారు: "నేను భక్తుల సంఘమును విడిచిపెట్టాను. నేను కేవలం ఈ మూర్ఖులందరితో అనుబంధం కలిగి ఉన్నాను. "అసత్, అసత్ -సంగ. Te kāraṇe lāgile mora karma-bandha-phāṅsa: "అందువలన నేను ఈ జననమరణ చక్రంలో చిక్కుకొన్నాను." తే కారణే. "కాబట్టి ఇది వదిలివేయండి." చాణక్య పండితుడు కూడా చెప్పారు, త్యజ దుర్జన సంసర్గం, "ఈ మూర్ఖుల సాంగత్యమును వదిలివేయుము." భజ సాధు-సమాగం, "భక్తులతో మాత్రమే సహవాసం చేయుము." ఇది సరైనది. మనము వివిధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము, ఇంద్రియానందం కోసం కాదు, కానీ భక్తుల యొక్క మంచి సాంగత్యం కోసం. మనము ఇది కోల్పోతే, ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే ఈ సంస్థ యొక్క నిర్వాహకులుగా ఉన్నారో, మనం ఈ సంస్థను లేదా ఈ కేంద్రాన్ని ఒక వేశ్యా గృహంగా చేయకూడదని వారు ఎల్లప్పుడూ తెలుసుకోవాలి. అక్కడ అలాంటి నిర్వహణ లేదా ఏర్పాటు అందుబాటులో ఉండాలి, ఎందుకంటే పవిత్రము అవ్వటానికి ఎల్లప్పుడూ మంచి సాంగత్యం ఉండాలి. అది అవసరం.

చాలా ధన్యవాదాలు. (ముగింపు)