TE/Prabhupada 0584 - మనము చ్యుతా, పతనము అవుతాము కానీ కృష్ణుడు అచ్యుతా



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972


కావున ఆత్మ చంపబడదు. Na hanyate hanyamāne śarīre. ఆత్మకు జన్మ మరియు మరణము లేదు కృష్ణుడు శాశ్వతమైన వారు కనుక, కృష్ణుడికి జన్మ మరియు మరణం లేదు... Ajo 'pi sann avyayātmā. నాలుగవ అధ్యాయంలో కృష్ణుడు చెప్తారు. Aja. కృష్ణుడికి మరో నామము అజా. లేదా విష్ణు-తత్వా.అజా. మనము కూడా అజా. అజా అంటే జన్మించనివాడు. కాబట్టి కృష్ణుడు, లేదా భగవంతుడు, జీవులు, వారు శాశ్వతమైన వారు . Nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). వ్యత్యాసము ఏమిటంటే మనము ఒక చిన్న కణము, కాబట్టి మనం భౌతిక శక్తితో కప్పబడి ఉంటాము. ఇది వ్యత్యాసం. మనము చ్యుతా, పతనము అవుతాము కానీ కృష్ణుడు అచ్యుతా. ఆయన ఎప్పుడూ పతనము అవ్వడు. అది వ్యత్యాసము. ఉదాహరణకు మేఘము వలె. మేఘం సూర్యకాంతి యొక్క ఒక భాగాన్ని కప్పి ఉంచుతుంది అంతే కాని ఆ మేఘం సూర్యరశ్మి అంతటిని కప్ప లేదు. అది సాధ్యం కాదు. ఉదాహరణకు ఇప్పుడు ఈ ఆకాశము మేఘము తో కప్పబడి ఉంది, బహుశా వంద మైళ్ళు, రెండు వందల మైళ్ళు లేదా ఐదువందల మైళ్ళు. అయితే,మిల్లియన్లు మరియు ట్రిలియన్ల మైళ్ళ విస్తారము కలిగిన సూర్యునితో పోల్చితే,అయిదు వందల మైళ్ళు ఏ మాత్రము, కాబట్టి మేఘం మన కన్నులను కప్పి ఉంచుతుంది, సూర్యుడు కాదు. అదేవిధముగా, మాయ జీవి కళ్ళను కప్ప గలదు. మాయ దేవాదిదేవుడిని కప్పదు. లేదు, అది సాధ్యం కాదు.

కాబట్టి ఈ జన్మ మరియు మరణం అని పిలవబడేవి మాయా కప్పడము వలన ఉన్నాయి. తటస్తా శక్తి. మనము... కృష్ణుడికి చాలా శక్తులు ఉన్నాయి. Parāsya śaktir vividhaiva śrūyate ( CC Madhya 13.65 purport) ఇది వేదముల సూచన. సంపూర్ణ సత్యము అనేక శక్తులను కలిగి ఉన్నది. మనము చూస్తున్నది ఏదైనా... Parasya brahmaṇaḥ śaktis tathedam akhilaṁ jagat. మనం చూస్తున్నది కొద్ది పాటిది అయినప్పటికీ, ఇది కేవలం దేవాదిదేవుని యొక్క శక్తి. సరిగ్గా అదే విధముగా : సూర్యరశ్మి సూర్య లోకము,మరియు సూర్య-దేవుడు. సూర్య-దేవుడు, ఆయన నుండి... సూర్య-దేవుడు మాత్రమే కాదు, ఇతర జీవులు కూడా ఉన్నారు. వారి శరీరం ప్రకాశిస్తుంది. వారు మండుతున్న శరీరం కలిగి ఉన్నారు. మనము భూసంబంధమైన శరీరమును కలిగి ఉన్నాము... భూమి ఈ లోకములో ప్రముఖంగా ఉంది. అదేవిధముగా , సూర్య లోకములో, అగ్ని ప్రముఖంగా ఉంది. భూమి ఐదు మూలకాలలో ఒకటిగా ఉన్నట్లుగా, అగ్ని కూడా ఐదు అంశాలలో ఒకటిగా ఉంది. ఈ విషయాలు వివరిస్తున్నాయి ఆత్మ ఎన్నటికీ అగ్నిచే దహించబడదు అని