TE/Prabhupada 0589 - ఈ భౌతిక రకాలను మనం అసహ్యించుకుంటాము



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972


అందువలన ఈ కోరిక, నేను భగవంతునిలో విలీనం అవుతాను, నేను ఒకటి అవుతాను... ఉదాహరణ ఇవ్వబడినది అది, "నేను నీటి చుక్క. ఇప్పుడు నేను గొప్ప మహాసముద్రంలోకి విలీనం అవుతాను. అందువలన నేను మహాసముద్రంగా ఉంటాను." ఈ ఉదాహరణ సాధారణంగా మాయావాది తత్వవేత్తలచే ఇవ్వబడుతుంది. నీటి చుక్క సముద్రపు నీటితో మిళితమైనప్పుడు, అవి ఒక్కటౌతాయి. అది కల్పన మాత్రమే. ప్రతి నీటి చుక్క, పరమాణువు, అక్కడ చాలా వ్యక్తిగత పరమాణు భాగాలు ఉన్నాయి. అవి మాత్రమే కాక, మీరు నీటితో కలపాలని అనుకుంటున్నారు, బ్రహ్మణ్ స్థితిలోకి విలీనం చేస్తే, సముద్ర, సముద్రం, లేదా మహాసముద్రం. అప్పుడు మళ్లీ నీవు ఆవిరైపోతావు, ఎందుకంటే సముద్రం నుండి నీరు ఆవిరైపోతుంది అది మేఘంగా మారుతుంది మళ్ళీ భూమిపై పడటంతో అది తిరిగి సముద్రంలోకి వెళుతుంది. ఇది జరుగుతోంది. ఇది ఆగమన-గమన అని పిలువబడుతుంది. కాబట్టి ప్రయోజనము ఏమిటి? కానీ వైష్ణవ తత్వము చెబుతుంది మనం నీటితో కలిసిపోవాలని కోరుకోము. మనము సముద్రంలో ఒక చేప కావాలని కోరుకుంటున్నాము. అది చాలా బాగుంది. ఒక చేప, ఒక పెద్ద చేప లేదా చిన్న చేప అయినా... అది పట్టింపు లేదు. మీరు నీళ్లలోకి లోతుగా వెళ్లి ఉంటే, అప్పుడు ఆవిరైపోవడం ఉండదు. మీరు ఉండిపోతారు.

అదేవిధముగా, ఆధ్యాత్మిక ప్రపంచం, బ్రహ్మణ్ తేజస్సు , అయితే... Nirbheda-brahmānusandhi. బ్రహ్మణ్ తేజస్సులో విలీనం కావటానికి ప్రయత్నిస్తున్న వారు, వారికి అది చాలా సురక్షితం కాదు. ఇది శ్రీమద్-భాగవతం లో వివరించబడింది: విముక్త-మానినః. Vimukta-māninaḥ. ఇప్పుడు నేను బ్రహ్మణ్ తేజస్సు లో విలీనం అయ్యాను ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను అని వారు ఆలోచిస్తున్నారు. లేదు, అది సురక్షితంగా లేదు. ఎందుకంటే అది చెప్పబడినది, āruhya kṛcchreṇa paraṁ padaṁ tataḥ patanty ( SB 10.2.32) గొప్ప తపస్సులు మరియు ప్రాయశ్చిత్తము తరువాత కూడా, పర పదం కు వెళ్లినా, లోపల, బ్రహ్మణ్ తేజస్సులోకి విలీనమైనా. అయినప్పటికీ, అక్కడ నుండి, ఆయన పతనమవుతాడు. ఆయన క్రిందకు వస్తాడు. ఎందుకంటే బ్రహ్మణ్, జీవాత్మ, ఆనందమయ. కృష్ణుడు లేదా సంపూర్ణమైన, దేవాదిదేవుడు, ఆనందమయోఽ'భ్యాసాత్ (వేదాంత-సూత్ర 1.1.12), సత్-చిత్-ఆనంద-విగ్రహః (Bs 5.1). కేవలం బ్రహ్మణ్ లో విలీనము కావడం ద్వారా ఏ ఒక్కరు ఆనందమయ కాలేరు. ఉదాహరణకు మీరు ఆకాశంలో చాలా ఎత్తులో వెళుతున్నారు. కాబట్టి ఆకాశంలో ఉండి పోవటము, ఇది చాలా ఆనందమయం కాదు. మీరు కొన్ని గ్రహాల్లో ఆశ్రయం పొందగలిగితే, అది ఆనందమా. లేకపోతే, మీరు తిరిగి ఈ లోకమునకు రావాలి.

కాబట్టి నిర్విశేష, భిన్నరకాలు లేకుండా, ఏ విధమైన ఆనందం ఉండదు. వెరైటీ (భేదము) భిన్నరకాలు ఆనందం యొక్క తల్లి. కాబట్టి మనం ప్రయత్నిస్తున్నాం... ఈ భౌతిక రకాలను మనం అసహ్యించుకుంటాము. అందువలన ఈ భిన్నరకాలు సున్నా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు కొందరు ఈ భిన్నరకాలు నిరాకారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది మనకు ఖచ్చితమైన అనంతమైన ఆధ్యాత్మిక ఆనందం ఇవ్వదు. మీరు బ్రహ్మణ్ తేజస్సు లోకి వెళ్లి, కృష్ణుని లేదా నారాయణుని ఆశ్రయం తీసుకుంటే... బ్రహ్మణ్ తేజస్సు లో అసంఖ్యాకమైన లోకములు ఉన్నాయి. వాటిని వైకుంఠ లోకము అని పిలుస్తారు. మరియు అగ్ర స్థాయిలో ఉన్న వైకుంఠ లోకమును గోలోక వృందావనం అని పిలుస్తారు. కాబట్టి ఈ గ్రహాలలో ఒకదానిలో ఆశ్రయం పొందటానికి మీరు తగినంత అదృష్టం కలిగి ఉంటే, మీరు జ్ఞానం యొక్క ఆనందకరమైన స్థితిలో నిత్య సంతోషంగా ఉన్నారు. లేకపోతే, కేవలం బ్రహ్మణ్ తేజస్సులోకి విలీనం కావడం, సురక్షితం కాదు. ఎందుకంటే మనము ఆనందం కోరుకుంటాము. కాబట్టి వ్యక్తిగతమైన సున్నా ప్రమాణంలో ఏ విధమైన ఆనందం ఉండదు. కానీ ఎందుకంటే మనకు వైకుంఠ గ్రహాల యొక్క సమాచారం లేనందున, మాయావాది తత్వవేత్తలు, వారు మళ్లీ తిరిగి ఇక్కడికి, ఈ భౌతిక గ్రహాలకు తిరిగి వస్తుంటారు . Āruhya kṛcchreṇa paraṁ padaṁ tataḥ patanty adhaḥ ( SB 10.2.32) Adhaḥ అధః అంటే ఈ భౌతిక ప్రపంచంలో అని అర్థం. నేను అనేక సార్లు వివరించాను. చాలా గొప్ప, గొప్ప సన్యాసులు ఉన్నారు. వారు ఈ భౌతిక ప్రపంచంను మిథ్య అని వదిలేస్తారు, జగంమిథ్య, మరియు వారు సన్యాసం తీసుకుంటారు, కొన్ని రోజుల తర్వాత, వారు సామాజిక సేవ, రాజకీయాల్లోకి వస్తారు. ఎందుకంటే వారు బ్రహ్మణ్ అంటే ఏమిటో గ్రహించలేరు. వారు, ఆనందము కోసం, ఈ భౌతిక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. ఎందుకంటే ఆనందమును... మనము కోరుకుంటాము ఆనందమయోఽ'భ్యాసత్ (వేదాంత-సూత్ర 1.1.12). ఏ విధమైన ఆధ్యాత్మిక ఆనందము లేకపోతే, తప్పని సరిగా, వారు కింది స్థాయికి రావాలి. ఈ భౌతిక ప్రపంచం అధమ స్థాయి. Apara. అపర. మనము ఆధ్యాత్మిక ఆనందమును లేదా ఉన్నతమైన ఆనందాన్ని పొందలేకపోతే, మనము ఈ భౌతిక ఆనందాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మనము ఆనందం కోరుకుంటాము. ఆనందం కొరకు అందరూ అన్వేషిస్తున్నారు