TE/Prabhupada 0644 - ప్రతిదీ కృష్ణ చైతన్యములో ఉంది



Lecture on BG 6.1 -- Los Angeles, February 13, 1969


ప్రభుపాద: కార్యక్రమాలు?

భక్తుడు: వినోదం.

భక్తుడు: కృష్ణ చైత్యన్య వ్యక్తికి వినోదం ఏమిటి?

ప్రభుపాద: వినోదం?

భక్తుడు: అవును. ప్రభుపాద: నృత్యము చేయడము. (నవ్వు) రండి, మాతో నృత్యం చేయండి, ఇది వినోదం కాదా? మీకు అలసట వస్తే ప్రసాదం తీసుకోండి. మీకు దీని కంటే ఎక్కువ వినోదం కావాలా? మీ జవాబు ఏమిటి. ఇది వినోదం కాదా?

భక్తుడు: అవును. నేను అనుకుంటున్నాను, ఇది కొందరికి కష్టంగా ఉంటుంది ఎవరైతే వస్తున్నారో ...

ప్రభుపాద: ఎందుకు కష్టం? నృత్యము చేయడము కష్టమా? కీర్తన చేయండి మరియు నృత్యం చేయండి?

భక్తుడు: ఆలయములో నివసించే భక్తుడికి ఇది సులభముగా ఉంటుంది.

ప్రభుపాద: కాని మీరు వచ్చినట్లు, ఎవరైనా రావచ్చు. అందరికీ స్వాగతం. ఈ నృత్యానికి మనము ఏమీ వసూలు చేయము. మీరు ball dance లేదా చాలా ఇతర నృత్యాలకు వెళ్ళితే, మీరు దాని కోసం చెల్లించాలి. కాని మనము వసూలు చేయము. మనము కేవలం, మా, ఈ విద్యార్థులు కేవలం ఏమైనా దానము ఇవ్వమని అడుగుతారు ఎందుకంటే మనము నిర్వహించాలి కనుక. మనము ఏమీ వసూలు చేయము. కాబట్టి మీరు కేవలం వచ్చి నృత్యం చేస్తే, వినోదం కోసం, అది చాలా బాగుంటుంది. ప్రతిదీ కృష్ణ చైతన్యములో ఉంది. మనము సంగీతమును కోరుకుంటున్నాం, ఇక్కడ సంగీతం ఉంది. మనకు నృత్యం కావాలి, నృత్యం ఉంది. మీరు మంచి సంగీత వాయిద్యాలను తీసుకురావచ్చు, మీరు చేరవచ్చు. మనము మంచి రుచికరమైన వంటకాలు పంచి పెడతాము. కాబట్టి ఆచరణాత్మకంగా ఈ పద్ధతి వినోదం ఇచ్చేది మాత్రమే. (నవ్వు) అవును. మీరు తీవ్రంగా భావిస్తే, మీరు ఈ పద్ధతిలో అస్సలు కష్టమే లేదు అని కనుగొంటారు, కేవలం వినోదం. సు-సుఖం ( BG 9.2) అది భగవద్గీతలో చెప్పబడినది తొమ్మిదో అధ్యాయంలో మీరు సు-సుఖం, కనుగొంటారు, ప్రతిదీ మనోహరముగా ఉన్నది మరియు సంతోషముగా ఉంది. ఇది సమస్యాత్మకముగా ఉన్నది అని ఏమైనా మా పద్ధతిలో కనుగోనండి. ఆచరణాత్మకంగా ఎవరైనా నాకు చెప్పండి. "ఈ విషయము చాలా సమస్యాత్మకమైనది." కేవలము మీ వ్యతిరేక వాదన చెప్పండి. కేవలం ఆనందమును ఇచ్చేది. ఇది కేవలము వినోదముగా ఉంది. అంతే. మీరు ఇప్పుడు చెప్పిన్నారు, "స్వామీజీ, మీ, ఈ విషయము చాలా వినోదాన్ని ఇస్తుందా లేదా, అనేది, అదే సంతోషములేని భాగము." ఏమీ లేదు.

ప్రజలు కోరుకుంటున్నారు. అది వారి సహజమైనది, ఉదాహరణకు ఈ పిల్లల వలె వారు అబ్బాయిలు మరియు అమ్మాయిలు నృత్యం చేస్తున్నట్లు చూసినప్పుడు, పిల్లలు కూడా నృత్యం చేస్తున్నారు. సహజముగా. ఇది సహజమైనది, ఇదీ జీవితము. ఆధ్యాత్మిక ప్రపంచంలో మన వాస్తవమైన జీవితము అది ఆందోళన లేదు. కేవలం ప్రజలు నృత్యం చేస్తూ, జపము చేస్తూ చక్కగా తింటున్నారు. అంతే. ఏ కర్మాగారం లేదు, ఏ కార్మికులు లేరు, అక్కడ సాంకేతిక సంస్థ లేదు. అవసరం లేదు. ఇవి అన్ని కృత్రిమముగా ఉన్నాయి. Ānandamayo 'bhyāsāt, (Vedānta-sūtra 1.1.12) వేదాంతం చెప్తుంది. ప్రతి జీవి, దేవుడు ఆనందమయ, పూర్తిగా ఆనందము మరియు సంతోషము కలిగిన వాడు మనము దేవునిలో భాగము, మనము కూడా అదే లక్షణము కలిగి ఉన్నాము. Ānandamayo 'bhyāsāt.. కాబట్టి మన మొత్తం పద్ధతి మహోన్నతమైన ఆనందమయ, కృష్ణుడిని, ఆయన నృత్య బృందములో చేరడము. ఇది మనకు వాస్తవమునకు సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ మనము కృత్రిమంగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాము. మరియు మనము నిరాశ చెందుతున్నాము. అయితే మీరు వాస్తవమునకు కృష్ణ చైతన్యములో ఉన్నట్లయితే, కేవలం మీరు మీ వాస్తవ పరిస్థితిని పునరుద్ధరించుకోండి, ఆనందం, కేవలం ఆనందం. Ānandamayo 'bhyāsāt. ఇవి వేదాంత పదములు. ఎందుకంటే మన స్వభావం అనందమయ. ప్రజలు, ప్రతి ఒక్కరూ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ La Cienega అవెన్యూ లో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, చాలా విషయాలు మరియు చాలా signboards ఉన్నాయి. ఎందుకు? వారు ప్రకటన చేస్తున్నారు, "రండి ఇక్కడ ఆనందము ఉంది, ఇక్కడ ఆనందం ఉంది." ఆయన ప్రకటనలు చేస్తున్నాడు, మనము కూడా ఇలా చేస్తున్నాము. "ఇక్కడ ఆనందం ఉంది." ప్రతి ఒక్కరు అనందము కొరకు వెతుకు తున్నారు. కాని ఆనందమునకు వేరే ప్రామాణికము ఉంది. అదే విషయము. ఎవరో భౌతిక కోణము నుండి ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు, కొంత మంది కల్పన, తత్వము, కవిత్వం లేదా కళ నుండి ఆనందాన్ని పొందేoదుకు ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది ఆధ్యాత్మిక దశలో ఆనందం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆనందాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.అది మన కర్తవ్యము మాత్రమే. ఎందుకు మీరు చాలా కష్టపడి పగలు మరియు రాత్రి పని చేస్తున్నారు? ఎందుకంటే మీకు తెలుసు, రాత్రి సమయంలో, "నేను ఆ అమ్మాయితో కలుస్తాను" లేదా "నేను భార్యతో కలసి, నేను ఆనందిస్తాను." మొత్తం, ప్రతి ఒక్కరూ ఆనందం కనుగొనేందుకు అన్ని రకాల ఇబ్బందులను అంగీకరిస్తున్నారు.

ఆనందం అంతిమ లక్ష్యం. కాని మనకు తెలియదు, ఆనందం ఎక్కడ ఉంది. అదే భ్రమ అంటే. వాస్తవమైన ఆనందం కృష్ణుడితో, ఆధ్యాత్మిక రూపములో ఉంది. మీరు ఎల్లప్పుడూ కృష్ణుడిని ఆనందముగా చూస్తారు. మీరు చాలా చిత్రాలు చూస్తారు. మనము చేరి ఉంటే, మీరు ఆనందము పొందుతారు, అంతే. కృష్ణుడు యంత్రముతో పని చేస్తున్నాడు అనే చిత్రాన్ని మీరు చూసారా? (నవ్వు) భారీ యంత్రం? లేదా హఆయన ధూమపానం చేస్తున్నట్లు ఏ చిత్రాన్ని అయినా మీరు చూసినారా? (నవ్వు) ప్రకృతి ద్వారా, ఆనందం, మీరు చూడండి? ఆనందం. కాబట్టి మీరు వికసించాలి, తెరుచుకోవాలి ఆవిధముగా. మీరు ఆనందమును కనుగొoటారు. కేవలం పూర్తిగా ఆనందము, అంతే. Ānandamayo 'bhyāsāt (Vedānta-sūtra 1.1.12). ప్రకృతి ద్వారా కేవలం ఆనందం. కృత్రిమంగా కాదు.

Ānanda-cinmaya-rasa-pratibhāvitābhiḥ. బ్రహ్మ సంహితలో మీరు కనుగొంటారు

ānanda-cinmaya-rasa-pratibhāvitābhis
tābhir ya eva nija-rūpatayā kalābhiḥ
goloka eva nivasaty akhilātma-bhūto
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Bs. 5.37)

Ānanda-cinmaya-rasa. రస అంటే రుచి అని అర్థం.మధురమైనది ఉదాహరణకు మనము ఒక తీపి మిఠాయిని, ఏదైనా రుచి చూడడానికి ప్రయత్నిస్తాము . ఎందుకు? ఎందుకంటే చాలా మంచి రుచి ఉన్నందున. కావున ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి నుండి కొంత రుచిని పొందాలని ప్రయత్నిస్తున్నారు. మనము లైంగిక జీవితం ఆనందించాలి అని కోరుకుంటాము. కొoత రుచి ఉంది. కావున దానిని ādi రుచి అని పిలుస్తారు - రుచి. కాబట్టి చాలా రుచులు ఉన్నాయి. బ్రహ్మ సంహితలో, ānanda-cinmaya-rasa. ఆ రుచి, భౌతిక రుచి, మీరు దానిని రుచి చూడవచ్చు, కాని అది వెంటనే పూర్తి అవుతుంది. వెంటనే ముగుస్తుంది. కొన్ని నిమిషాలు తరువాత ఉదాహరణకు. ఉదాహరణకు మీ దగ్గర చాలా చక్కని తీపి మిఠాయి ఉంది అని అనుకుందాం. మీరు దానిని రుచి చూస్తారు. మీరు, ",ఇది చాలా బాగుంది." "మరొకటి తీసుకోండి." అయితే సరే. " మళ్లీ మరొకటి?" "వద్దు, నాకు ఇష్టం లేదు," పూర్తి అయింది. మీరు చూడoడి? కాబట్టి భౌతిక రుచికి ముగింపు ఉంటుంది. ఇది అపరిమితమైనది కాదు. కాని వాస్తవమైన రుచి అపరిమితముగా ఉంటుoది. మీరు ఒక దాన్ని రుచి చూస్తే మీరు మర్చిపోలేరు. ఇది పెరుగుతుంది, పెరుగుతుంది, పెరుగుతునే ఉంటుంది. Ānandāmbudhi-vardhanam. చైతన్య మహాప్రభు చెప్తారు, "ఈ రుచి కేవలము పెరుగుతోంది." మహాసముద్రం లాగా ఉన్నప్పటికీ, గొప్పది, అయినప్పటికీ ఇది ఇంకా పెరుగుతోంది. ఇక్కడ మీరు సముద్రమును చూశారు. ఇది పరిమితం. మీ పసిఫిక్ మహాసముద్రం అల్లకల్లోలముగా ఉంటుంది, కాని అది పెరగడము లేదు. అది కనుక పెరుగుతూ ఉంటే, అప్పుడు నాశనము ఉంటుoది, మీరు చూడండి? కాని దేవుడు నియమావళి ప్రకారము, ప్రకృతి చట్టము ద్వారా దాని పరిమితి దాటి అది రాదు. పరిమితి లోపల అది ఉంటుంది ఉంది. కానీ చైతన్య మహాప్రభు చెప్తారు ఆనందము యొక్క మహాసముద్రం, రుచి యొక్క సముద్రం, ఆధ్యాత్మిక ఆనందం యొక్క మహాసముద్రము ఉంది. అది పెరుగుతూనే ఉంది Ānandāmbudhi-vardhanaṁ prati-padaṁ pūrṇāmṛtāsvādanaṁ sarvātma-snapanaṁ paraṁ vijayate śrī-kṛṣṇa-saṅkīrtanam. హరే కృష్ణ కీర్తన చేయడము ద్వారా మీరే దానిని పొందుతారు, మీ ఆనందం శక్తి మరింత ఎక్కువ, ఎక్కువగా ఎక్కువగా మరింత ఎక్కువగా పెరుగుతుంది