TE/Prabhupada 0674 - తెలివిని కలిగి ఉండండి.శరీరానికి సరిపోయేలా తినడానికి ఎంత అవసరం అనేది తెలుసుకోవడానికి



Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969


భక్తుడు: ప్రభుపాద, మనకు తగినంత నిద్ర ఏమిటి, తగినంత ఆహారం ఏమిటి అని గుర్తించగల సామర్థ్యం కలిగి ఉన్నామా? మనము ప్రయోగం చేయడానికి ప్రయత్నిస్తాము, మనము తగ్గించాలని ప్రయత్నిస్తాము... (అస్పష్టమైనది) ఎన్నోసార్లు, మనల్ని మనం పిచ్చివారిగా చేసుకుంటాము. మనము అంటాము "అవును, నాకు ఇంత ఆహారం అవసరం". లేదా "నాకు ఏడు లేదా ఎనిమిది గంటల నిద్ర అవసరం", కానీ వాస్తవమునకు, మీకు తెలుసా, అది కేవలం.... మనము హేతుబద్ధం చేస్తున్నాము. (అస్పష్టమైనది)

ప్రభుపాద: ఆహారాన్ని తీసుకునే నిర్ణయం? లేదు, మీ ప్రశ్న ఏమిటి, నేను...?

భక్తుడు: మన స్వంత, మన స్వంత హేతుబద్ధతను నమ్మవచ్చా ? మనం మన స్వంతాన్ని విశ్వసించవచ్చా ఎంత అని నిర్ణయించుటలో?

ప్రభుపాద: సరే, అది ఉండాలి, హేతుబద్ధీకరణ అక్కడ ఉండాలి. మీరు తప్పు చేసినట్లయితే, తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా, ఆ తప్పు తప్పు కాదు. (నవ్వు) మరింత తీసుకోవాలని పట్టుదల కలిగి వుండవద్దు. మీరు తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారాన్ని మీరు తీసుకున్నారని అనుకుందాం, ఆ తప్పు, తప్పు కాదు. కానీ, మీరు ఎక్కువ తీసుకుంటే, ఆ తప్పు, తప్పు. కాబట్టి హేతుబద్ధీకరణ, మీ హేతుబద్ధమైన కార్యక్రమాలు సరైనవి కాదని మీరు అనుకుంటే, మీరు పొరపాటు చేస్తున్నారు ఇటు వైపు, తక్కువ వైపు ఇంకొక వైపు పొరపాటు చేయకండి. అవును.

లేదు, ఆ విశ్వాసము... హేతుబద్ధీకరణ ఎల్లప్పుడూ ఉంది, కానీ ఒక వ్యక్తి తన శరీరానికి సరిపోయేలా తినడానికి ఎంత అవసరం అనేదానికి తగినంత తెలివిని కలిగి వుండాలి. అందరిలో ఇది ఉంది. సహజముగా, తప్పు ఉండదు