TE/Prabhupada 0675 - ఒక భక్తుడు దయ యొక్క మహాసముద్రము. ఆయన దయను పంచాలని కోరుకుంటాడు



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969

ప్రభుపాద: పేజీ నూట యాభై ఆరు.

విష్ణుజన: "క్రమంగా, ఒక అడుగు తరువాత ఒక అడుగు వేస్తూ, పూర్తి నమ్మకంతో, వ్యక్తులు మేధస్సు ద్వారా సమాధిలో స్థిరముగా ఉండాలి, అందువలన మనస్సు ఆత్మ పై మాత్రమే ఉండాలి, వేరే ఏమీ ఆలోచించకూడదు ( BG 6.25)

ప్రభుపాద: అవును. ఆత్మ ... మనస్సు ఆత్మపై మాత్రమే లగ్నము అవ్వాలి. మనము ఆత్మలము కృష్ణుడు కూడా ఆత్మ ఉదాహరణకు మీరు సూర్యుడుపై మీ కళ్ళను లగ్నము చేస్తే అప్పుడు మీరు సూర్యుడిని మరియు మిమ్మల్ని మీరు కూడా చూడగలరు. కొన్నిసార్లు దట్టమైన చీకటిలో కూడా మనము మనల్ని చూడలేము. మీరు అనుభవించినట్లు. కాబట్టి నా శరీరాన్ని దట్టమైన చీకటిలో చూడలేను. శరీరం నాతో ఉన్నప్పటికీ, నేను శరీరాన్ని లేదా నేను ఏమైనా నేను, నేను నన్ను చూడలేను. మీకు అనుభవం ఉన్నది. మీరు సూర్యరశ్మిలో ఉంటే, సూర్యకాంతి, అప్పుడు నీవు సూర్యుడిని మరియు నిన్ను నీవు కూడా చూడగలవు. అవునా కాదా? అందువలన ఆత్మను చూడాలనుకుంటే మొదట మహోన్నతమైన ఆత్మను చూడాలి. మహోన్నతమైన ఆత్మ కృష్ణుడు. వేదాలలో, కఠోపనిషత్తు, nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). మహోన్నతమైన ఆత్మ అన్ని శాశ్వతమైనవాటికీ ప్రధాన శాశ్వతమైనది. ఆయన అన్ని జీవులకు ప్రధాన జీవి కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే - ఆత్మలో స్థిరపడి ఉండుట... అదే ఉదాహరణ. మీరు మీ మనస్సును కృష్ణుడి మీద స్థిరపరిచినట్లయితే, అప్పుడు మీ మనసును మీరు అన్ని విషయాల్లో స్థిరముగా ఉంచవచ్చు. మళ్ళీ అదే ఉదాహరణ, మీరు మీ కడుపు మీద శ్రద్ధ వహిస్తే, అప్పుడు మీరు అన్ని శరీర అవయవాలను జాగ్రత్తగా చూసుకుంటారు. మీ కడుపుకి చక్కని పోషక ఆహారము సరఫరా చేస్తే, కడుపు అన్ని ఆటంకాల లేకుండా స్పష్టంగా ఉంటుంది, అప్పుడు మీరు మంచి ఆరోగ్యముతో ఉంటారు. కాబట్టి మీరు చెట్టు యొక్క మూలంలో నీటిని పోస్తే, అప్పుడు మీరు అన్ని శాఖలు, ఆకులు, పువ్వులు, కొమ్మలు, ప్రతిదీ, సహజముగా శ్రద్ధ తీసుకోబడుతాయి.

మీరు కృష్ణుడిని జాగ్రత్తగా చూసుకుంటే, మీరు ఇతరులకు ఉత్తమమైన సేవ చేస్తారు. సహజముగా. ఈ బాలురు, వారు కీర్తన బృందముతో వెళుతున్నారు. ఎందుకంటే వారు కృష్ణ చైతన్యములో ఉన్నారు, వారు ఈ ఆలయంలో ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొని లేరు. వారు బయటకు వెళ్ళుతున్నారు, ఈ తత్వమును ప్రచారము చేస్తున్నారు కాబట్టి ఇతరులు దీని ఉపయోగమును పొందగలరు. కాబట్టి కృష్ణ చైతన్య వ్యక్తి ఖాళీగా కూర్చోని ఉండలేరు. ఆయన జీవితంలో ఇలాంటి మంచి తత్వమును, ఎందుకు ప్రచారము చేయకూడదని భావిస్తున్నాడు. అది ఆయన లక్ష్యం. యోగి ఉన్నత స్థాయిలో తనకు తాను సంతృప్తి చెందవచ్చు. ఆయన ఏకాంత ప్రదేశములో కూర్చోని, యోగాను అభ్యసిస్తూ, ఆధ్యాత్మిక జీవితములో అతనే ఉన్నతి సాధిస్తాడు. అది తన వ్యక్తిగతము . కాని ఒక భక్తుడు కేవలం తన వ్యక్తిగతముగా, తాను మాత్రమే ఉన్నత స్థానమునకు వెళ్ళటానికి సంతృప్తి చెందడు. మనము వైష్ణవులను గౌరవిస్తాము

vāñchā-kalpatarubhyaś ca
kṛpā-sindhubhya eva ca
patitānāṁ pāvanebhyo
vaiṣṇavebhyo namo namaḥ

ఆయన ఒక వైష్ణవుడు, ఆయన ఒక భక్తుడు, ఈ బద్ధజీవాత్మల మీద చాలా దయగలవాడు. Kṛpā-sindhubhya eva ca. కృపా అంటే దయ, సింధు అంటే సముద్రము. ఒక భక్తుడు దయ యొక్క మహాసముద్రము. ఆయన దయను పంచాలని కోరుకుంటాడు.

ఉదాహరణకు జీసస్ క్రైస్ట్ మాదిరిగానే, ఆయన దేవుడు చైతన్యమును, కృష్ణ చైతన్యమును కలిగి ఉన్నాడు, కాని ఆయన తనకు తాను సంతృప్తిపడలేదు. ఆయన తన దేవుడు చైతన్యమును ఒంటరిగా కొనసాగించినట్లయితే, ఆయనకు శిలువ వేయించుకునే పరిస్థితి వచ్చేది కాదు కాని కాదు. ఆయన ఇతరులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకున్నాడు, ఇతరులు దేవుడు చైతన్యమును కలిగి ఉండాలి. మిగతా వారు కృష్ణ చైతన్యము కలిగి ఉండాలి. ఆయన రాజుచే నిషేధించబడ్డాడు - అలా చేయకూడదు అని. కాబట్టి తన జీవితము ప్రమాదములో ఉన్నా ఆయన చేశాడు. అది భక్తుల స్వభావం. అందువలన బోధక భక్తుడు, భగవంతుడి యొక్క అత్యంత ప్రియమైన భక్తుడు. ఇది భగవద్గీతలో చెప్పబడింది. వారు బయటకు వెళ్తున్నారు, వారు ప్రచారము చేస్తున్నారు, వారు ప్రత్యర్థి వ్యక్తులను కలుస్తున్నారు. కొన్నిసార్లు వారు ఓడిపోతున్నారు, కొన్నిసార్లు నిరాశకు గురవుతున్నారు, కొన్నిసార్లు ఒప్పించగలుగుతున్నారు, వివిధ రకాల ప్రజలు ఉన్నారు. అందువల్ల, ప్రతి భక్తుడు చాలా చక్కగా కలిగి ఉన్నాడు అని కాదు. భక్తులు కూడా మూడు తరగతులు ఉన్నారు. కాని ఆ ప్రయత్నము. నేను వెళ్ళి కృష్ణ చైతన్యాన్ని నేను బోధిస్తాను, అది భగవంతునికి ఉత్తమమైన సేవ. వారు ప్రయత్నిస్తున్నందున, వ్యతిరేకిస్తున్నవారితో, ప్రజలను ఆత్మ సాక్షాత్కారములో అత్యధిక ప్రమాణాలకు తీసుకువెళ్ళడానికి.

కాబట్టి ఎవరైనా చూసిన వ్యక్తి, ఆత్మ-సాక్షాత్కారము యొక్క సమాధిలో ఉన్నవాడు, ఆయన నిస్సందేహంగా కూర్చోని ఉండలేడు. ఆయన బయటకు రావాలి. ఆయన... ఉదాహరణకు రామానుజాచార్య వలె. ఆయన బహిరంగంగా మంత్రాన్ని ప్రకటించాడు. ఆయన ఆధ్యాత్మిక గురువు చెప్పారు ఈ మంత్రం ... ఉదాహరణకు మీ దేశంలోకి ఆ మహర్షి వచ్చినట్లు. ఆయన ఏదో రహస్యమైన మంత్రం ఇవ్వాలని అనుకున్నాడు. ఆ మంత్రానికి ఏదైనా శక్తి ఉంటే, అది ఎందుకు రహస్యముగా ఉండాలి? ఏది ఏమైనా అన్ని మంత్రాలకు ఏమైనా (శక్తి) ఉంటే, ఎందుకు బహిరంగంగా ప్రకటించకూడదు? దాని వలన ప్రతి ఒక్కరూ ఆ మంత్రం యొక్క ప్రయోజనమును పొందుతారు ఇది సత్యము. ఇది మోసం, మీరు చూడండి? కాబట్టి ఇక్కడ మోసం చేసే పద్ధతి లేదు. ఈ మహా మంత్రం మిమ్మల్ని రక్షించగలదని మనము చెప్తున్నాము, మనము బహిరంగముగా ప్రచారము చేస్తున్నాము, కాదా. ఉచితముగా, ఏ రుసుము లేకుండా. కాని ప్రజలు చాలా మూర్ఖులు, వారు దీనిని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆ మహర్షి కొరకు, ఆ మంత్రం కొరకు వారు ఆరాట పడతారు. ముప్పై-ఐదు డాలర్లు చెల్లించండి రహస్య మంత్రాన్ని తీసుకోండి, మీరు చూడండి? కాబట్టి ప్రజలు మోసం చేయాబడాలని కోరుకుంటున్నారు. ఇక్కడ, హరే కృష్ణ మంత్రం, ఈ ప్రజలు ఏ విధమైన రుసుము లేకుండా ప్రచారము చేస్తున్నారు, వీధిలో, ఉద్యానవనంలో ప్రతిచోటా, రండి, తీసుకోండి." ", ఇది మంచిది కాదు." ఇది మాయ, ఇది భ్రాంతి అంటారు. ఇది మాయ యొక్క ప్రభావము. మీరు ఏదైన వసూలు చేస్తే, మీరు మోసం చేస్తే, ప్రజలు అనుసరిస్తారు Sacha bole tomare lata juta jagat harai, dhana kali-yuga dukha lalge haspai (?). ఇది ఒక భక్తుడి హిందీ శ్లోకము, ఈ కలి-యుగము ఎంతటి అసహ్యమైనది అంటే మీరు సత్యము చెప్పినట్లయితే, అప్పుడు ప్రజలు కొట్టడానికి ఏదైనా రాడ్ తో వస్తారు. మీరు వారిని మోసం చేస్తే, వారు తికమక బడతారు, వారు ఇష్టపడతారు. నేను దేవుడిని అని చెప్పితే ప్రజలు", స్వామిజీ, ఇక్కడ ఉన్నారు దేవుడు." మీరు దేవుడుగా ఎలా మారారు? అని వారు విచారణ చేయరు దేవుడి యొక్క లక్షణం ఏమిటి? మీరు అన్ని లక్షణాలను కలిగి ఉన్నారా? "ఎవరూ విచారించరు. కాబట్టి ఈ విషయాలు జరుగుతాయి, ఒక వేళ ఒకరు ఆత్మలో స్థిరపరడకపోతే, వాస్తవమైన ఆత్మ యొక్క అర్థం ఏమిటో అవగాహన చేసుకుంటే తప్ప, దేవుడు అంటే ఎవరో అర్థము చేసుకుంటే తప్ప. యోగా అంటే ఈ ఆత్మ-సాక్షాత్కార పద్ధతిని అర్థం చేసుకోవటము. అది యోగా. చదవటము కొనసాగించండి