TE/Prabhupada 0678 - కృష్ణ చైతన్య వ్యక్తి ఎప్పుడూ యోగ సమాధిస్థితిలో ఉంటాడు



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969


విష్ణు జన: శ్లోకము 27: “ఏ యోగి అయితే తన మనస్సును ఎల్లప్పుడు నాయందు ఉంచుతాడో అతడు నిశ్చయముగా అత్యధిక ఆనందాన్ని పొందుతాడు. బ్రహ్మణ్ తో తనకు ఉన్న సంబంధము వలన, అతడు ముక్తి పొందుతాడు, ఆయన మనస్సు శాంతిగా వుంటుంది. ఆయన కోరికలు శాంతిస్తాయి, అతడు పాపము నుండి విముక్తి పొందుతాడు ( BG 6.27) .

ఇరవై-ఎనిమిది: "ఆత్మలో స్థిరమై, అన్ని భౌతిక కాలుష్యం నుండి విముక్తి పొందినవాడై, యోగి, మహోన్నతమైన సంపూర్ణ ఆనందాన్ని పొందుతాడు, భగవంతునితో చైతన్యముతో సంబంధము వలన ( BG 6.28) .

ప్రభుపాద: అందువల్ల ఇక్కడ సంపూర్ణత ఉంది, "యోగి ఎవరైతే తన మనస్సును నాపై లగ్నం చేస్తాడో". నేను అంటే కృష్ణుడు. కృష్ణుడు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతుంటే, "నాకు ఒక గ్లాసు నీరు ఇవ్వండి". దీని అర్థం నీటిని వేరొకరికి సరఫరా చేయాలి అని కాదు. అదేవిధంగా, భగవద్గీత భగవంతుడైన శ్రీకృష్ణునిచే పలుకబడింది ఇంకా ఆయన అన్నారు "నాకు" నేను అంటే కృష్ణుడు. ఇది స్పష్టమైన అవగాహన. కానీ అనేక మంది వ్యాఖ్యాతలు ఉన్నారు, వారు కృష్ణుడి నుండి దారి తప్పుతారు. ఎందుకో నాకు తెలియదు. అది వారి నీచ ఉద్దేశ్యము. కాదు. నేను అంటే కృష్ణుడు. కాబట్టి కృష్ణచైతన్య వ్యక్తి ఎప్పుడూ యోగ సమాధిస్థితిలో ఉంటాడు. కొనసాగించు.