TE/Prabhupada 0694 - మనము ఆ సేవా వైఖరిలో మరల ఉంచబడాలి. అది పరిపూర్ణ నివారణ



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969


భక్తుడు: "దీన్ని చేయలేకపోతే, ఆయన పడిపోతాడు. భాగవతము దీనిని ధ్రువీకరిస్తుంది సేవలు చేయనివారు, భగవంతుని పట్ల తన కర్తవ్యముని నిర్లక్ష్యం చేస్తున్న వారు ఎవరైనా, భగవంతుడు అన్ని జీవుల యొక్క మూలం, అటువంటి వాడు తప్పకుండా తన స్వరూప స్థితి నుండి పతనము అవుతారు. '"

ప్రభుపాద: అవును.

ya eṣāṁ puruṣaṁ sākṣād
ātma-prabhavam īśvaram
na bhajanty avajānanti
sthānād bhraṣṭāḥ patanty adhaḥ
(SB 11.5.3)

ఇది చాలా చక్కని ఉదాహరణ. భాగవతము చెప్తుంది మనము అందరము భగవంతునిలో భాగము మనం భగవంతునికి సేవ చేయకపోతే, అప్పుడు మనము మన నిర్దిష్ట స్థానము నుండి పతనము అవుతాము. అది ఏమిటి? అదే ఉదాహరణ ఇవ్వవచ్చు, ఈ వేలు, అది వ్యాధికి గురైతే, మొత్తం శరీరానికి సేవ చేయలేదు, అది కేవలం నొప్పిని ఇస్తుంది భాగం యొక్క మరొక అంశం - అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భాగం నిత్యము సేవలను చేయలేకపోతే, అది బాధాకరమైనది అని అర్థం. కాబట్టి భగవంతునికి సేవ చేయని వ్యక్తి, ఆయన భగవంతునికి కేవలం నొప్పి ఇస్తున్నాడు. ఆయన కేవలం ఇబ్బంది ఇస్తున్నాడు. అందువలన ఆయన బాధ పడాలి. ప్రభుత్వ చట్టాలను అంగీకరించలేని వ్యక్తిలా, ఆయన కేవలం ప్రభుత్వానికి నొప్పిని ఇస్తాడు ఆయన నేరస్థుడిగా మారే అవకాశము ఉంది. ఆయన అనుకోవచ్చు "నేను చాలా మంచి వ్యక్తిని" కానీ ఆయన ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించినందుకు, ఆయన కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇది చాలా సులభం.

కాబట్టి, సేవ చేయని వారు ఎవరైనా, భగవంతునికి సేవ చేయని జీవి ఎవరైనా, ఆయన బాధాకరమైనవాడు. ఆయన బాధాకరం కనుక, కృష్ణుడు వస్తాడు. ఆయన నొప్పి అనుభూతి చెందుతాడు. అది పాపం, మనము నొప్పిని ఇస్తే. ఇదే ఉదాహరణ. Sthānād bhraṣṭāḥ patanty adhaḥ. ఒక విషయము చాలా బాధాకరమైన వెంటనే ఉదాహరణకు ప్రభుత్వం ఈ బాధాకరమైన పౌరులను జైలు గృహములో ఉంచుతుంది. కలిసి ఉంటారు. మీరు ఇక్కడ నివసించండి, మీరు అందరు అర్థంలేని వారు, మీరు నేరస్థులు. ఇక్కడ నివసించండి. రాష్ట్రములో స్వతంత్రతకు కలత కలిగించ వద్దు. అదేవిధముగా భగవంతుని చట్టాలను ఉల్లంఘించిన ఈ నేరస్థులు, వారు కేవలం భగవంతునికి నొప్పి ఇచ్చిన వారు, వారు ఈ భౌతిక ప్రపంచంలో ఉంచబడతారు. వీరందరు., sthānād bhraṣṭāḥ patanty adhaḥ, ఆయన ఉన్న స్థానము నుండి పతనము అవుతాడు మీ వేలు బాధాకరమైనది అయితే, అదే ఉదాహరణ లాగానే, వైద్యుడు సలహా ఇస్తాడు, "ఓ, అయ్యా, మీ వేలును ఇప్పుడు కత్తిరించాలి లేకపోతే అది మొత్తం శరీరాన్ని కలుషితం చేస్తుంది. " కాబట్టి sthānād bhraṣṭāḥ, ఇది ఉన్న స్థానము నుండి పతనము అయితే

మనం పతనము అయినాము. భగవంతుని చైతన్యము యొక్క సూత్రాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు, మనము అందరము పతనము అయినాము. కావున మనము మన వాస్తవ స్థానమును పునరుద్ధరించాలని అనుకొంటే, మనము ఆ సేవా వైఖరిలో మరల ఉంచబడాలి. అది పరిపూర్ణ నివారణ. లేకపోతే మనము నొప్పిని అనుభవిస్తాము, భగవంతుడు మన వలన బాధ పడుతుంటాడు మీ కుమారుడు మంచి వాడు కాకపోతే, మీరు బాధపడతారు మరియు కుమారుడు బాధపడతాడు. అదేవిధముగా, మనము భగవంతుని కుమారులము. కాబట్టి మనము బాధగా ఉన్నప్పుడు, భగవంతుడు కూడా బాధ పడతాడు. మన వాస్తవ కృష్ణ చైతన్యమును పునరుద్ధరించడం మరియు భగవంతుని యొక్క సేవలో వినియోగించబడడము ఉత్తమమైనది. ఇది సహజ జీవితం, ఇది ఆధ్యాత్మిక ఆకాశంలో లేదా గోలోక వృందావనములో సాధ్యమవుతుంది. చదవడము కొనసాగించు