TE/Prabhupada 0708 - అది చేపల జీవితానికి నా జీవితానికి మధ్య తేడా



Lecture on SB 3.26.32 -- Bombay, January 9, 1975


నేను ఆత్మను కాబట్టి, ఈ భౌతిక వాతావరణంతో నాకు పని ఏమీ లేదు. Asaṅgo 'yaṁ puruṣaḥ. ఈ ఆత్మకు పని ఏమీ లేదు. కానీ తన భౌతిక సాంగత్యము వలన, వేర్వేరు పద్ధతుల ద్వారా, మనము కలిగి ఉన్నాము , నేను చెప్పేది ఏమిటంటే, ఈ శరీరమును పెంచడము, భౌతికము శరీరమును మనము ఇప్పుడు... అది చిక్కుకొన్నది. ఉదాహరణకు ఒక చేప వలె (నెట్వర్క్) వలలో చిక్కుకొన్నది, అదేవిధముగా, మనం జీవులము మనం చిక్కుకుపోతున్నాం ఈ భౌతిక పదార్ధాలతో తయారు చేయబడిన ఈ నెట్వర్క్ లో. చాలా కష్టమైన పరిస్థితి. మత్స్యకారుని వలయంలో చిక్కుకున్న చేపలా, లేదా మాయా, అదేవిధముగా, మనము ఇప్పుడు భౌతిక ప్రకృతిచే సృష్టించబడిన నెట్వర్క్ లో పట్టుబడ్డాము. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarva... ( BG 3.27) ప్రకృతి యొక్క నిర్దిష్టమైన భౌతిక గుణాలతో మనము అనుబంధం కలిగి ఉన్నాము కనుక, ఇప్పుడు మనం చిక్కుకున్నాము. చేపలు చిక్కుకోవడం వలె, అదేవిధముగా, మనము కూడా చిక్కుకుపోతున్నాము. ఈ భౌతిక ప్రపంచం గొప్ప మహా సముద్రం, భవార్ణవ. ఆర్ణవ అనగా మహాసముద్రం, భవ అంటే, జన్మ మరియు మరణం తిరిగి పునరావృతము అయ్యే పరిస్థితి ఇది భవార్ణవ అని అంటారు. Anādi karama-phale, paḍi' bhavārṇava-jale. Anādi karma-phale: "సృష్టికి ముందు నేను నా కార్యక్రమాల యొక్క ఫలితము వలన , ఎట్లాగైతేనే, నేను ఇప్పుడు ఈ మహా సముద్రంలో పడి పోయాను భవార్ణవ, జననం మరణం తిరిగి పునారావృతము. " చేపలు చిక్కుకోవడము వలె, అది జీవితము కోసం పోరాడుతాడు, వల నుండి ఎలా బయటపడాలి... దానికి ప్రశాంతత లేదు. మీరు చూస్తారు అది వలలో చిక్కుకున్న వెంటనే , "ఫట్! ఫట్ ! ఫట్ ! ఫట్ ! ఫట్ !" అది బయట పడాలని కోరుకుంటుంది. అందువల్ల అది మన జీవితము యొక్క పోరాటము, ఎలా బయటపడాలి. మనకు తెలియదు.

అందువల్ల బయట పడాలనుకుంటే, కృష్ణుడి కృప మాత్రమే. ఆయన ప్రతిదీ చేయవచ్చు. ఆయన వెంటనే ఈ చిక్కులో నుండి బయట పడవచ్చు. ఆయన సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు? నేను బయటకు వెళ్ళగలను. చేప బయటకు రాలేదు, కానీ..., మత్స్యకారుడు కోరుకుంటే, ఆయన వెంటనే బయటకు తీసి నీటిలో పడ వేయవచ్చు. అప్పుడు ఆది మళ్ళీ జీవితం పొందుతుంది అదేవిధముగా, మనము కృష్ణుడికి శరణాగతి పొందితే, ఆయన వెంటనే బయటకు తీస్తాడు. ఆయన ఇలా అన్నాడు, ahaṁ tvāṁ sarva-pāpebhyo మీరు కేవలము శరణాగతి పొందండి. జాలరి చూసినట్లుగా, "ఫట్! ఫట్! ఫట్!" కానీ చేప శరణాగతి పొందితే.. ఆయన శరణాగతి పొందాలని కోరుకుంటాడు, కానీ ఆయనకు భాష తెలియదు. అందువలన ఆయన నెట్వర్క్ లోపలే ఉంటాడు కానీ మత్స్యకారుడు ఇష్టపడితే, ఆయన దాన్ని బయటకు తీసి నీటిలో పడ వేస్తాడు అదేవిధముగా, మనము కృష్ణుడికి శరణాగతి పొందినాము... ఆ శరణాగతి పొందే పద్ధతి కోసం ఈ మానవ జీవితం ఉద్దేశించబడినది. ఇతర జీవితంలో - చేప చేయలేదు, కానీ నేను చెయ్యవచ్చు. అది చేపల జీవితానికి నా జీవితానికి మధ్య తేడా. నెట్వర్క్ లో చిక్కుకొన్న చేప, దానికి శక్తి లేదు. అది పతనము అయ్యింది