TE/Prabhupada 0760 - ఈ ఉద్యమంలో లైంగిక జీవితం నిషేధించబడలేదు, కానీ కపటత్వం నిషేధించబడింది



Lecture on SB 6.1.23 -- Honolulu, May 23, 1976


కాబట్టి మనిషి తన యొక్క కర్తవ్యము ఏమిటో అర్థం చేసుకోకుండా, ఎందుకంటే ఆయన పతనమయినాడు, కాబట్టి మనం మరణం వరకు మన కుటుంబం పిల్లలను పోషించడానికి బాధపడకూడదు. కాదు ఇరవై ఐదు సంవత్సరాల వరకు. బ్రహ్మచారి లైంగిక జీవితం నుండి దూరంగా ఉండటానికి శిక్షణ పొందుతాడు. అది బ్రాహ్మచారి, బ్రహ్మచర్యము. కానీ ఆయన ఇంకా ఉండలేక పోతే, అప్పుడు అతడు గృహస్థ జీవితాన్ని అంగీకరించాలి. ఏ మోసం, వంచన లేదు, నేను బ్రహ్మచారి లేదా సన్యాసిని అని ప్రకటించుకోవటానికి, నేను రహస్యంగా అన్నీ అర్థంలేనివి చేస్తాను. ఇది వంచన. వంచన జీవితముతో ఆధ్యాత్మిక జీవితంలో ఎవరూ అభివృద్ధి చెందరు. ఇది శ్రీ చైతన్య మహా ప్రభు ఇచ్చిన ఉదాహరణ. చోటా హరిదాస,, చిన్న హరిదాస మీకు తెలికు, ఆయన వ్యక్తిగత సహచరుడు. ఆయన చాలా చక్కగా పాడతాడు, అందుచే ఆయన చైతన్య మహా ప్రభు యొక్క సభలో పాడుచున్నాడు. ఒక రోజు ఆయన Śikhi Mahiti's యొక్క సోదరి నుండి కొంత బియ్యం అర్ధించడానికి వెళ్ళాడు, అక్కడ ఒక యువతి ఉంది, అతడు ఆమె వంక కామముతో చూసాడు. ఇది కొన్నిసార్లు సహజమైనది. కానీ చైతన్య మహా ప్రభు అది అర్థం చేసుకున్నారు. మనకు భోధించడానికి, ఆయన తినే సమయంలో, ఆయన ఇలా అన్నాడు, "ఈ బియ్యం ఎవరు తీసుకువచ్చారు?" చోట హరిదాసా. "కాబట్టి నన్ను మరెప్పుడు చూడకూడదని ఆయనకి చెప్పండి." అందరూ ఆశ్చర్య పోయారు: "ఏం జరిగింది?" అప్పుడు విచారణ ద్వారా ఆయన ఒక యువతిని కామముతో చూశాడు. కాబట్టి కేవలం... చైతన్య మహా ప్రభు చాలా కఠినంగా ఉన్నాడు. కావున తన సహచరుల నుండి ఆయనను తిరస్కరించాడు. అప్పుడు ఇతర పెద్ద పెద్ద భక్తులు ఆయనతో " ఆయన కొంత తప్పు చేశాడు దయచేసి ఆయనని క్షమించండి. అతడు మీ సేవకుడు. " అందువల్ల చైతన్య మహాప్రభు అన్నారు, "సరే, మీరు ఆతనిని తిరిగి తీసుకురండి. మీరు ఆతనితో నివసించండి. నేను ఈ స్థలాన్ని వదిలి వెళ్లిపోతున్నాను. నేను ఈ స్థలాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. " వారు చెప్పారు, "లేదు, అయ్యా, మేము ఇకపై ఈ ప్రశ్నను తిరిగి తీసుకు రాము."

కాబట్టి ఈ చోట హరిదాసా మళ్లీ చైతన్య మహా ప్రభు యొక్క సభకు వెళ్ళడం అసాధ్యమని తెలుసుకున్నప్పుడు, ఆయన నిరాశ చెందాడు. అప్పుడు ఆయన త్రివేణికి దగ్గరకి వెళ్ళిఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి చైతన్య మహా ప్రభుకు అంతా తెలుసు. తర్వాత, కొంత సమయము తరువాత, ఆయన చోటా హరిదాసా గురించి ఏమి అడిగారు? ఎవరో అన్నారు, "అయ్యా, మీరు ఆయనని తిరస్కరించారు, నిరాశతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు..." ఓ, అది బాగుంది. ఎంత కఠినమైన వారో చూడండి. "అది బాగుంది." ఆయన ఏ విధమైన సానుభూతిని వ్యక్తం చేయలేదు: "నేను ఈ వ్యక్తిని తిరస్కరించాను ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు?." లేదు. ఆయన అన్నాడు, ", అది బాగుంది.,అది సరే ఆయన ఇలా అన్నాడు. ఇది ఒక విషయము.

మరొక విషయము: శివానంద, ఆయన యొక్క అత్యంత ఉన్నతమైన భక్తుడు, ఆయన చైతన్య మహాప్రభుతో వస్తున్న అందరి భక్తుల శ్రద్ధ తీసుకున్నాడు రథ-యత్రా సమయంలో సందర్శించడానికి. అందువల్ల ఆయన భార్య వచ్చి చైతన్య మహా ప్రభుకు ప్రణామము చేసినది, ఆయన భార్య గర్భవతి అని చూశారు. వెంటనే వెంటనే, "శివానందతో, మీ భార్య గర్భవతిగా ఉందా?" "అవును". సరిగ్గా, ఆమె పిల్ల వాడుకు జన్మనిచ్చినప్పుడు, మీరు ఆయనకు ఈ పేరును పెట్టండి. ఇప్పుడు చూడండి. ఒక వ్యక్తి, కేవలం ఒక యువకుడు స్త్రీ వంక కోరికతో చూశాడు; ఆయన తిరస్కరించాడు. వేరే ఒక మనిషి తన భార్య గర్భవతిగా ఉంది; ఆయన అతన్ని గౌరవించాడు: "ఇది సరైనది." కాబట్టి ఈ ఉద్యమంలో లైంగిక జీవితం నిషేధించబడలేదు, కానీ కపటత్వం నిషేధించబడింది. మీరు కపటముగా మారితే, అప్పుడు ఎక్కడా లేదు... అది చైతన్య మహా ప్రభు యొక్క ఉపదేశము. చోట హరిదాసా, ఆయన ఒక బ్రహ్మచారిగా ఉన్నాడు ఆయన ఒక యువతి వంక చూస్తున్నాడు. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు, "ఆయన కపటి, ఆయనని తిరస్కరించండి." శివానంద సేన, ఆయన గృహస్తుడు. గృహస్తుడు పిల్లలు కలిగి ఉండాలి. అందులో తప్పు ఏమిటి? ఆయన చెప్పాడు, "అవును, నా ఆహారం యొక్క ఉచ్ఛిష్టను ఇవ్వాలి." ఇది చైతన్య మహా ప్రభు యొక్క ఉద్యమం.

కాబట్టి మన అభ్యర్థన, కపటముగా ఉండవద్దు. నాలుగు ఆశ్రమములు ఉన్నాయి: బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్త, సన్యాస. మీ కోసం ఏది అనుకూలమైనదో, మీరు దానిని అంగీకరించాలి. కానీ నిజాయితీతో. కపటముతో ఉండకూడదు. మీరు లైంగికం జీవితము కావాలని అనుకుంటే, సరే, మీరు పెళ్లి చేసుకోండి మరియు ఒక పెద్దమనిషిగా ఉండండి. కపటముతో ఉండకండి. ఇది చైతన్య మహా ప్రభు యొక్క ఉద్యమం. ఆయనకు వంచన ఇష్ట పడలేదు. ఎవరూ ఇష్టపడ్డారు. అయితే కృష్ణ చైతన్యము ఉద్యమములో తీవ్రముగా నిమగ్నమైన వ్యక్తికి, ఆయనకి మైథునజీవితం మరియు భౌతికము ఐశ్వర్యం మంచిది కాదు. ఇది చైతన్య మహా ప్రభు యొక్క అభిప్రాయం. Pāraṁ paraṁ jigamiṣor bhava... Niṣkiñcanasya bhajanonmukhasya, pāraṁ param ( CC Madhya 11.8) .. అందువల్ల స్వచ్ఛందంగా చైతన్య మహా ప్రభు సన్యాసమును అంగీకరించారు. ఆయన, తన కుటుంబ జీవితంలో చాలా చక్కగా ఉండేవారు. ఆయన కుటుంబం మనిషిగా ఉన్నప్పుడు, ఆయన రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఒక భార్య మరణించింది; అందువలన ఆయన మళ్లీ వివాహం చేసుకున్నారు. అందువల్ల చైతన్య మహా ప్రభు మనము కపటి కాకూడదు...అని భోధించారు కానీ ఆయన సన్యాసమును తీసుకున్నప్పుడు, ఆయన చాలా చాలా కఠినంగా ఉన్నాడు. స్త్రీలు ఎవరు తనకు చాలా దగ్గరికి రావడానికి లేదు. దూరం నుండి. ఇది చైతన్య మహా ప్రభు యొక్క ఉపదేశము.