TE/Prabhupada 0761 - మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వారు ఎవరైనా పుస్తకాలను చదవాలి



Lecture -- Honolulu, May 25, 1975


ప్రభుపాద: ఒక శ్లోకము ఉంది, samo 'haṁ sarva-bhūteṣu na me dveśyo 'sti na priyaḥ ( BG 9.29) కృష్ణుడు చెప్తాడు... భగవంతుడు అందరికీ సమానంగా ఉండాలి. భగవంతుడు ఒకడు, అందువల్ల ఆయన ప్రతి ఒక్కరికీ ఆహారం ఇస్తున్నాడు. పక్షులు, జంతువులు, అవి ఆహారం పొందుతున్నాయి. ఏనుగు కూడా ఆహారం పొందుతోంది. ఆయనకి ఆహారాన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు? కృష్ణుడు, భగవంతుడు, సరఫరా చేస్తున్నాడు. ఆ విధముగా ఆయన ప్రతి ఒక్కరికి సమానం, సాధారణ వ్యవహారాల్లో. ప్రత్యేకించి భక్తులతో వ్యవహరిస్తున్నప్పుడు. ఉదాహరణకు ప్రహ్లాద మహా రాజు లాగానే. ఆయనను ప్రమాదములో ఉంచినప్పుడు, అప్పుడు భగవంతుడు నరసింహ స్వామి- వ్యక్తిగతంగా ఆయనని రక్షించటానికి వచ్చాడు. ఇది భగవంతుని ప్రత్యేక కర్తవ్యము. అది అసహజమైనది కాదు. ఎవరైనా చెప్పినట్లైయితే, "భగవంతుడు పక్షపాతము కలిగిన వాడు, ఆయన తన భక్తుని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు" లేదు, అది పక్షపాతము కాదు. ఉదాహరణకు ఒక పెద్ద మనిషి వలె - తన చుట్టు ప్రక్కల ప్రాంతంలో, ఆయన పిల్లలందరిని ప్రేమిస్తాడు కానీ తన స్వంత పిల్ల వాడు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. అది అసహజమైనది కాదు. మీరు అతన్ని నిందించలేరు, "ఎందుకు నీ పిల్ల వాని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు?" కాదు. అది సహజమైనది. ఎవరూ అతన్ని నిందించరు. అదేవిధముగా, ప్రతి ఒక్కరూ భగవంతుని కుమారులు, కానీ ఆయన భక్తుడు ప్రత్యేకమైనవాడు. అది భగవంతుని ప్రత్యేక శ్రద్ధ. Ye tu bhajanti māṁ prītyā teṣu te mayi. కాబట్టి భగవంతుడు ప్రతి జీవికి రక్షణ కల్పిస్తున్నాడు, కానీ మీరు భగవంతుని యొక్క భక్తుడు అయితే, స్వచ్ఛమైన భక్తుడు, ఏ ఉద్దేశ్యం లేకుండా, అప్పుడు భగవంతుడు మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం, మనము మాయ ద్వారా బాధపడుతున్నాము, భౌతిక శక్తి, మనము కృష్ణుని ఆశ్రయం తీసుకుంటే, అప్పుడు మనం ప్రత్యేకంగా రక్షించబడతాము.

Mām eva prapadyante
māyām etāṁ taranti te
( BG 7.14)

కాబట్టి కృష్ణుని భక్తుడు కావడానికి ప్రయత్నించండి. మన కృష్ణ చైతన్య ఉద్యమం ఈ తత్వమును ప్రచారము. చేస్తుంది మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వారు ఎవరైనా పుస్తకాలను చదవాలి, భక్తుడు, ఆలయములో నివాసము ఉండే వారు, బయటవారు, అప్పుడు మీరు కృష్ణ చైతన్యము అంటే ఏమిటో గ్రహించవచ్చు. లేదా మీరు హరే కృష్ణ మాత్రమే కీర్తన జపము చేయాలి. చెత్త విషయాలు మాట్లాడవద్దు సమయము వృధా చేయవద్దు. ఇది మంచిది కాదు. ఒక్క క్షణం చాలా విలువైనది, మీరు మిలియన్ల డాలర్లు ఉపయోగించి కూడా కొనుగోలు చేయలేరు. ఇప్పుడు మే 25, నాలుగు గంటల సమయము అయిపోయింది. మీరు దాన్ని తిరిగి తీసుకురాలేరు. నాలుగు గంటల, 25 మే 1975, మీరు మిలియన్ల డాలర్లు చెల్లించడం ద్వారా దాన్ని తిరిగి పొందాలనుకుంటే, అది సాధ్యం కాదు. కాబట్టి మన సమయాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. సమయం ఒకసారి వృధా అయినప్పుడు , మీరు తిరిగి పొందలేరు. ఈ సమయమును ఉపయోగించుకుందాము. ఉత్తమమైనది హరే కృష్ణ కీర్తన చేయడము, కృష్ణుని గురించి ఆలోచించటం, కృష్ణుని ఆరాధించడం ఉత్తమమైనది. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. చాలా ధన్యవాదాలు. భక్తులు: జయ ప్రభుపాద