TE/Prabhupada 0789 - కర్మ క్షేత్రం,క్షేత్రం యొక్క యజమాని మరియు క్షేత్రం యొక్క పర్యవేక్షకుడు



Lecture on BG 13.4 -- Paris, August 12, 1973


భక్తుడు: అనువాదము, "ఇప్పుడు దయచేసి ఈ క్షేత్రము యొక్క కార్యక్రమాల గురించి నా సంక్షిప్త వివరణ వినుము, అది ఎలా ఏర్పడింది, దాని యొక్క మార్పులను, దేని నుండి అది ఉద్భవించినది క్షేత్రజ్ఞుడు ఎవరు, ఆయన ప్రభావాలు ఏమిటి."

ప్రభుపాద: Tat kṣetram ( BG 13.4) Idaṁ śarīraṁ kaunteya kṣetram ity abhidhīyate (BG 13.2). : కాబట్టి కృష్ణుడు ఇప్పటికే వివరించాడు, క్షేత్రం అంటే ఇదం శరీరం. శరీరం అర్థం ఈ దేహము. తత్ క్షేత్రం శరీరం. అన్నింటిలో మొదటిది, మీరు అర్థం చేసుకోవాలి అది ఈ శరీరం లేదా ఏదైనా కర్మ క్షేత్రం, ఎక్కడైనా, మూడు విషయాలు అక్కడ ఉన్నాయి: కర్మ క్షేత్రం, క్షేత్రం యొక్క యజమాని మరియు క్షేత్రం యొక్క పర్యవేక్షకుడు. మీరు తనిఖీ చేయవచ్చు ఎక్కడైనా సరిచూసుకోవచ్చు. కాబట్టి కృష్ణుడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అన్నాడు. ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు మరియు ఒక కర్మ క్షేత్రం. ఒకటి కర్మ క్షేత్రం మరియు ఇద్దరు వ్యక్తులు, క్షేత్రజ్ఞ . ఒకరు నివసించు వారిగా భావించబడాలి, మరియొకరు యజమాని అవ్వవలసి ఉంటుంది.

ఉదాహరణకు ఈ ఇంటిలాగా మనము నివసిస్తున్నాము ఇల్లు క్షేత్రం, కర్మ క్షేత్రం. భూస్వామి యజమాని మరియు మనము నివసిస్తున్నాము. ఇద్దరు క్షేత్రజ్ఞః . ఈ ఇంటి ఆస్తిపై ఇద్దరు వ్యక్తులకు ఆసక్తి. ఒకరు నివసించువాడు మరియు మరొకరు యజమాని. అదేవిధముగా, ఎక్కడైనా, ప్రపంచంలోని ఏ భాగంలో అయినా, ఎక్కడికి వెళ్ళినా, మీరు ఈ మూడు విషయాలను కనుగొంటారు: ఒకటి, కర్మ క్షేత్రము, మిగతా ఇద్దరు, ఒకరు నివసించువాడు మరియు ఒకరు యజమాని. ఒకవేళ ఒకరు ఈ మూడు విషయాలను అర్థం చేసుకుంటే, ఆయన ఈ మూడు విషయాలను ప్రతిచోటా అధ్యయనం చేయవచ్చు, అప్పుడు : kṣetra-kṣetrajñayor yad jñānam. ఈ జ్ఞానం, ప్రతిచోటా అక్కడ ఒక కర్మ క్షేత్రము ఉంది అని అర్థం చేసుకోవడానికి మరియు ఇద్దరు వ్యక్తులు ఆ కర్మ క్షేత్రం పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారు... ఒకరు యజమాని, మరొకరు నివసించేవాడు మీరు ఈ మూడు విషయాలను మాత్రమే అధ్యయనం చేసినట్లయితే, అప్పుడు: taj-jñānaṁ jñānam. అది జ్ఞానం. లేకపోతే అందరూ దుష్టులు మరియు మూర్ఖులు, అంతే. మతమ్ మమ.

ఇది జ్ఞానం. కానీ ఈ ప్రస్తుత కాలంలో ఎవరినైనా అడగండి, ఎవరు యజమాని, ఎవరు అనుభవించువాడు మరియు కర్మ క్షేత్రం ఏమిటి. మీరు మూడు విషయాలను అడిగితే, ఎవరూ సమాధానం చెప్పలేరు. దాని అర్థం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మూర్ఖులు. లేదా వారికి తెలియదు. Kṣetra-kṣetrajñayor yaj-jñānam, కృష్ణుడు చెప్తున్నారు కర్మ క్షేత్రంకు, మరియు యజమానికి మధ్య ఉన్న సంబంధం.

ఉదాహరణకు వ్యవసాయంలో వలె. భూమి యజమాని రాష్ట్రం లేదా రాజు . దానిని వేరొకరికి అద్దెకు ఇస్తారు లేదా ఇతరులు నివసిస్తుంటారు. భూమి కర్మ క్షేత్రం. కాబట్టి కృష్ణుడు మార్గ దర్శకత్వం ఇస్తున్నాడు. కృష్ణుడు మార్గ దర్శకత్వం ఇస్తున్నాడు, అక్కడ జీవులు ఉన్నారు. అతను ఆ మార్గదర్శకత్వంలో ఆ దిశగా పని చేస్తున్నాడు. కాబట్టి కృష్ణుడు మరియు జీవుడు ఇద్దరూ ఒక చెట్టు మీద కూర్చుని ఉన్నారు. అది ఉపనిషత్తులో చెప్పబడింది. రెండు పక్షులు ఒక్క చెట్టులో కూర్చొని ఉన్నాయి. ఒకటి చెట్టు యొక్క పండు తింటుంది మరొకటి కేవలం సాక్షిగా ఉంది. సాక్షి పక్షి కృష్ణుడు. ఎవరైతే చెట్టు యొక్క పండ్లు తింటుందో ఆ పక్షి, అతను జీవి. మాయావాది తత్వవేత్తలు, వారు జీవాత్మ , పరమాత్మ మధ్య తేడాను గుర్తించలేరు. వారికి తెలుసు, కానీ వారు అద్వైతవాదులు కనుక, వారి సిద్ధాంతమును ప్రచారము చేసుకొనుటకు, వారు చెప్తారు రెండు లేదు అని, ఒకటే ఉంది. లేదు. కృష్ణుడు చెప్పారు రెండు ఇద్దరని. ఒక క్షేత్రజ్ఞ జీవాత్మ మరియు ఇంకొక క్షేత్రజ్ఞ ఆయన కృష్ణుడు. ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసం అది వ్యక్తిగత జీవికి తన క్షేత్రం లేదా శరీరం గురించి మాత్రమే తెలుసు, కానీ ఇతర జీవికి, మహోన్నతమైన జీవాత్మకు, ఆయనకు అన్ని శరీరాల గురించి తెలుసు