TE/Prabhupada 0792 - అందరికీ కృష్ణుడుస్నేహితునిగా లేకుండా ఉంటే, ఎవరూ క్షణం కూడా నివసించలేరు



Lecture on SB 1.2.17 -- Los Angeles, August 20, 1972


ప్రద్యుమ్న: అనువాదం, "శ్రీకృష్ణుడు, దేవాదిదేవుడు, ఎవరైతే ప్రతి ఒక్కరి హృదయంలో కూడా పరమాత్మగా ఉన్నారో మరియు శ్రద్ధావంతులైన భక్తుని యొక్క శ్రేయోభిలాషి, భక్తుడి హృదయంలోని భౌతికముగా ఆనందించాలనే కోరికను తొలగించి వేస్తాడు ఎవరైతే తన (కృష్ణుడి) సందేశాలు వినాలనే కోరికను పెంపొందించుకుంటారో, ఏవైతే వాటికవే పుణ్యప్రదమైనవో, వాటిని సరిగా కీర్తన మరియు శ్రవణము చేసినప్పుడు."

ప్రభుపాద: కృష్ణుడు చాలా స్వార్థపరుడా. ఆయన చెప్పినారు... ఇక్కడ చెప్పబడింది: స్వ-కథా కృష్ణః. ఎవరైనా కృష్ణుడి కథను శ్రవణము చేయడానికి నిమగ్నమై ఉన్నారో. కథ అంటే మాటలు, ఉపదేశాలు, సందేశాలు. కాబట్టి, భగవద్గీతలో, కృష్ణుడు చెప్పారు, మామ్ ఏకం: "కేవలం నన్ను." ఏకం. ఇది అవసరం. సర్వమూ కృష్ణుడే అయినప్పటికీ, కానీ అద్వైత సిద్ధాంతం ప్రకారం మనము ప్రతిదాన్నీ పూజించము. అంతా కృష్ణుడే, ఇది వాస్తవం, కానీ దాని అర్థం మనము ప్రతిదానిని ఆరాధించాలని కాదు. మనము కృష్ణుడిని పూజించాలి. మాయావాది తత్వవేత్తలు, వారు చెప్తారు, "ప్రతిదీ కృష్ణుడు అయితే, కాబట్టి నేను ఆరాధించేది ఏదైనా, నేను కృష్ణుడిని పూజిస్తున్నట్లే." కాదు.ఇది తప్పు.

ఉదాహరణకు దాని గురించి ఇదే విధమైన ఉదాహరణ ఇవ్వవచ్చు, శరీరం లో - నేను ఈ శరీరం - ప్రతిదీ "నేను," లేదా "నాది," కానీ ఆహార పదార్థాలను తీసుకోవలసి వచ్చినప్పుడు, ఇది పురీషనాళం ద్వారా నెట్టబడదు, కానీ నోటి ద్వారా తీసుకోవాలి. అది మాత్రమే పద్ధతి. మీరు చెప్పలేరు, శరీరం తొమ్మిది రంధ్రాలు కలిగి ఉంది: రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు, రెండు చెవులు, ఒక నోరు, ఒక పురీషనాళం, ఒక జననేంద్రియం-తొమ్మిది రంధ్రాలు. అందువల్ల ఎందుకు ఆహారాన్ని ఏ రంధ్రంలోనైనా నెట్టలేము?" అది మాయావాది సిద్ధాంతం. ఏమైనప్పటికీ, వారు చెప్పేది, "శరీరం లోపలికి, శరీరానికి ఆహారాన్ని ఇవ్వాలి. కాబట్టి నేను ఏ రంధ్రం ద్వారానైనా ఆహార పదార్థాన్ని పంపుతాను. చాలా రంధ్రాలు ఉన్నాయి." కొన్నిసార్లు వైద్య విజ్ఞానంలో, నోటి ద్వారా ఆహారం పంపడం సాధ్యం కాకపోతే వారు పురీషనాళం ద్వారా నెట్టుతారు. అది కృత్రిమమైనది. కానీ అత్యవసరమైనపుడు, వారు కొన్నిసార్లు చేస్తున్నారు. కానీ అది మార్గము కాదు. వాస్తవమైన మార్గం, శరీరానికి ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఇది నోరు ద్వారా ఇవ్వాలి, ఏ ఇతర రంధ్రం ద్వారా కాదు.

అదేవిధముగా, మనం వాస్తవమునకు సంపూర్ణ సత్యంతో మన సంబంధాన్ని కోరుకుంటే, అప్పుడు మనము కృష్ణుడి ద్వారా వెళ్ళాలి. కృష్ణుడికి అనేక రూపాలున్నాయి. Advaitam acyutam anādim ananta-rūpam (Bs. 5.33). అనంత-రూపం. కాబట్టి ... ఎందుకంటే కృష్ణుడు లేకుండా ఏమీ లేదు, ప్రతిదీ కృష్ణుడి శక్తి. కాబట్టి, పద్ధతి ఏంటంటే... పరమ సత్యమును సంప్రదించడం అంటే కృష్ణ. అందువల్ల ఇక్కడ కృష్ణుడు చెప్తాడు... కృష్ణుడు కాదు. వ్యాసదేవుడు చెప్పినది, సూత గోస్వామి ద్వారా, అది కృష్ణుడు చాలా దయగల వాడు, సుహృత్ సతాం చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు. సతాం. సతాం అంటే భక్తులు. ఆయన భక్తులతో స్నేహంలో సన్నిహితముగా ఉంటాడు. కృష్ణుడి యొక్క మరొక లక్షణం (సామర్థ్యం యోగ్యత), భక్త-వత్సల. ఇక్కడ కూడా చెప్పబడింది, సుహృత్ - సతాం. సతాం అంటే భక్తులు. ఆయన ప్రతి ఒక్కరి స్నేహితుడు. సుహృదాం సర్వ-భూతానాం ( BG 5.29) అందరికీ కృష్ణుడు స్నేహితునిగా లేకుండా ఉంటే, ఎవరూ క్షణం కూడా నివసించలేరు. మీరు... కృష్ణుడు ప్రతి ఒక్కరినీ రక్షిస్తున్నాడు, ప్రతి ఒక్కరికీ ఆహారాన్ని అందజేస్తున్నాడు