TE/Prabhupada 0793 - అందువల్ల ఉపదేశము మధ్య వ్యత్యాసం లేదు. అందువలన గురువు ఒకరే



Lecture What is a Guru? -- London, August 22, 1973


గురువు యొక్క కర్తవ్యము విజ్ఞానము అనే టార్చ్ లైట్ ను తీసుకొని అమాయకులకు, లేదా చీకటిలో ఉన్న శిష్యునికి చూపెట్టాలి, అది ఆయనకి ఇస్తుంది, చీకటి లేదా అజ్ఞానం యొక్క బాధలు నుండి ఆయనకి ఉపశమనం. ఇది గురువు యొక్క కర్తవ్యము.

తరువాత మరొక శ్లోకము చెప్తుంది,

tad-vijñānārthaṁ sa gurum evābhigacchet
samit-pāṇiḥ śrotriyaṁ brahma-niṣṭham
(MU 1.2.12)


ఇది వేదముల ఉత్తర్వు. ఎవరో అడుగుతున్నారు గురువు పరిపూర్ణముగా అవసరమా అని అవును, పరిపూర్ణముగా అవసరం. అది వేదముల ఉత్తర్వు. వేదాలు అంటున్నాయి, tad-vijñānārtham. తద్- విజ్ఞానార్థం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం; ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడము Tad-vijñānārtham. స—ఒకరు; గురుమ్ ఏవ —ఏవ అంటే తప్పకుండా; గురుమ్ - ఒక గురువు వద్దకు. గురువు దగ్గరకు వెళ్ళాలి. ఎవరో ఒక గురువు దగ్గరకు కాదు. గురువు దగ్గరకు. గురువు ఎవరు అంటే. మన రేవతీనందన మహారాజుచే వివరించబడినందున, గురువు గురు శిష్య పరంపర ద్వారా వస్తున్నాడు. ఏదైతే ఐదు వేల సంవత్సరాల క్రితం వ్యాసదేవుడు ఉపదేశించినాడో, లేదా కృష్ణుడు ఉపదేశించినది, మనము కూడా దానినే ఉపదేశిస్తున్నాము. అందువల్ల ఉపదేశము మధ్య వ్యత్యాసం లేదు. అందువలన గురువు ఒకరే. వందలు మరియు వేలాది మంది ఆచార్యులు వచ్చి వెళ్ళినారు, కానీ సందేశం ఒకటే. అందువలన గురువు రెండు కాదు. వాస్తవ గురు భిన్నంగా మాట్లాడడు. నా అభిప్రాయములో, మీరు ఇలా ఉండాలి, అని ఎవరో గురువు చెప్తారు ఇంకో గురువు, "నా అభిప్రాయములో మీరు దీన్ని చేయండి " అని చెప్తారు వారు గురువు కాదు; వారు అందరు మూర్ఖులు. గురువుకి "సొంత" అభిప్రాయం లేదు. గురువుకు కేవలం ఒక అభిప్రాయం మాత్రమే ఉంది, అదే అభిప్రాయం, ఇది కృష్ణుడు లేదా వ్యాసదేవుడు లేదా నారదుని చేత వ్యక్తం చేయబడింది, లేదా అర్జునుడు లేదా శ్రీచైతన్య మహాప్రభు లేదా గోస్వాములు. మీరు అదే విషయమును చూస్తారు . అయిదు వేల సంవత్సరాల క్రితం, భగవంతుడు శ్రీ కృష్ణుడు భగవద్గీతను చెప్పాడు వ్యాసదేవుడు దానిని వ్రాసాడు. రికార్డు చేసినాడు వ్యాసదేవుడు చెప్పలేదు "ఇది నా అభిప్రాయం." అని వ్యాసదేవుడు వ్రాసాడు , శ్రీ భగవాన్ ఉవాచ: "నేను వ్రాస్తున్నది ఏమిటి అంటే, ఇది భగవంతుడు దేవాదిదేవుని ద్వారా మాట్లాడబడింది." ఆయన తన సొంత అభిప్రాయం ఇవ్వడం లేదు. శ్రీ భగవాన్ ఉవాచ. అందువలన ఆయన గురువు. ఆయన కృష్ణుడి యొక్క ఉపదేశాలు తప్పుగా అర్థం చేసుకోవడము లేదు. ఆయన అది యధాతధముగా ఇస్తున్నాడు. కేవలం ఒక బేరర్, సేవకుని వలె. ఎవరో మీకు ఉత్తరాలు వ్రాశారు, జమాను లేఖను కలిగి ఉన్నాడు. ఇది ఆయన దానిని సరిచేయాలి లేదా సవరించాలి లేదా అదనంగా సవరించాలి లేదా కాదు... ఆయన దానిని ఉన్నది ఉన్నట్లు ఇవ్వాలి. ఇది ఆయన కర్తవ్యము. అప్పుడు ఆయన గురువు. ఆయన నిజాయితీ గలవాడు. అదే విధముగా, గురువు రెండుగా ఉండకూడదు. గుర్తుంచుకోండి . వ్యక్తి భిన్నంగా ఉండవచ్చు, కానీ సందేశం అదే ఉండాలి. అందువలన గురువు ఒకరే