TE/Prabhupada 0813 - వాస్తవ స్వాతంత్ర్యం ఈ భౌతిక చట్టాల బారి నుండి ఎలాబయటపడాలి



751011 - Lecture BG 18.45 - Durban


ఇది ప్రహ్లాద మహారాజు యొక్క కథనము. ఆయన తన స్నేహితుల మధ్య కృష్ణ చైతన్యమును ప్రచారము చేస్తున్నాడు. ఆయన ఒక రాక్షస తండ్రి కుటుంబములో జన్మించాడు ఎందుకంటే, హిరణ్యకశిపు, ఆయన "కృష్ణుడు " అని పలకడమును కూడా నిలిపివేయబడ్డాడు. ఆయన రాజ మందిరములో ఏ అవకాశం పొందలేకపోయాడు, కాబట్టి ఆయన పాఠశాలకు వస్తున్నప్పుడు, ఫలహారము తీసుకునే సమయములో ఆయన తన చిన్న స్నేహితులను పిలిచేవాడు, ఐదు సంవత్సరాల వయస్సులో వారు వారికి, ఆయన ఈ భాగవత-ధర్మమును ప్రచారము చేసేవాడు. స్నేహితులు చెప్పేవారు, "నా ప్రియమైన ప్రహ్లాద, మనము ఇప్పుడు పిల్లలము. ఓ, ఈ భాగవత-ధర్మము యొక్క ఉపయోగం ఏమిటి? మనము ఆడుకుందాము" లేదు, "ఆయన చెప్పాడు," లేదు. " Kaumāra ācaret prājño dharmān bhāgavatān iha, durlabhaṁ mānuṣaṁ janma ( SB 7.6.1) నా ప్రియమైన మిత్రులారా, మీరు వృద్ధాప్యంలో కృష్ణ చైతన్యమును పెంపొందించుకుందాము ప్రస్తుతము దానిని ప్రక్కన పెడదాము అని చెప్పకండి. కాదు కాదు. దుర్లభము. "మనం ఎప్పుడు చనిపోతామని మనకు తెలియదు. తరువాతి మరణం ముందు ఈ కృష్ణ చైతన్య విద్యను పూర్తి చేయాలి. " అది మానవ జీవితం యొక్క లక్ష్యం. లేకపోతే మనము అవకాశాన్ని కోల్పోతున్నాము.

కాబట్టి అందరూ శాశ్వతంగా నివసించాలని కోరుకుంటారు, కానీ ప్రకృతి దానిని అనుమతించదు. అది సత్యము. మనము చాలా స్వతంత్రంగా ఆలోచించవద్దు, కానీ మనము స్వతంత్రంగా లేము. మనము ప్రకృతి యొక్క కఠినమైన చట్టాలలో ఉన్నాము. ఒక యువకుడు, మీరు "నేను వృద్ధుడను అవుతాను" అని చెప్పలేరు. లేదు మీరు అవ్వాలి. అది ప్రకృతి ధర్మము. మీరు చెప్తే "నేను చనిపోను," అని అంటుంటే, మీరు చనిపోవాలి. కాబట్టి ఇది ప్రకృతి యొక్క చట్టం. కాబట్టి మనం, మనము మూర్ఖులము. ప్రకృతి చట్టమేమిటో వాస్తవంగా మనకు తెలియదు.

prakṛteḥ kriyamāṇāni
guṇaiḥ karmāṇi sarvaśaḥ
ahaṅkāra-vimūḍhātmā
kartāham iti manyate
(BG 3.27)

అంతా భౌతిక ప్రకృతి చట్టాలచే కలుషితమైనది, ఇప్పటికీ, మనం దుష్టులము మరియు మూర్ఖులము కనుక, మనము "స్వతంత్రులము" అని ఆలోచిస్తున్నాము. ఇది మన తప్పు. ఇది మన తప్పు. జీవితం యొక్క లక్ష్యమేమిటో మనకు తెలియదు, ఎలా ప్రకృతి, ప్రకృతి, మనల్ని తీసుకు వెళ్ళుతుంది, జీవిత సమస్యల నుండి మనం ఎలా రక్షించుకోగలము. జీవిత తాత్కాలిక సమస్యలను పరిష్కరించడంలో మనము తీరిక లేకుండా ఉన్నాము, ఉదాహరణకు ఆధారపడటం లేదా స్వాతంత్ర్యం వలె . ఇవి తాత్కాలిక సమస్యలు. వాస్తవమునకు మనము స్వతంత్రంగా లేము. మనము ప్రకృతి చట్టాలపై ఆధారపడి ఉన్నాము. ఉదాహరణకు మనము స్వతంత్రులము అయితే, స్వతంత్రత అని పిలవబడేది కొన్ని రోజులు అని మనం అనుకుందాం. అది స్వాతంత్రం కాదు. వాస్తవ స్వాతంత్ర్యం ఈ భౌతిక చట్టాల బారి నుండి ఎలా బయటపడాలి.

అందువల్ల కృష్ణుడు మీ ముందు సమస్యను ఉంచుతాడు... మనకు చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అవి తాత్కాలికమైనవి. వాస్తవమైన సమస్య, కృష్ణుడు చెప్తాడు, janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam ( BG 13.9) జ్ఞానం ఉన్న వ్యక్తి ఎప్పుడూ తన ముందు వాస్తవమైన సమస్యను ఉంచుకుంటాడు. అది ఏమిటి? జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి. ఇది మీ వాస్తవమైన సమస్య. కాబట్టి మానవ జీవితం ఈ నాలుగు సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించబడింది: జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి. అది కృష్ణ చైతన్యము వలన చేయబడుతుంది. కాబట్టి జీవితంలోని అంతిమ సమస్యలను పరిష్కరించడానికి ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును మనము ముందుకు తీసుకు వెళ్ళుతున్నాము కాబట్టి మన అభ్యర్థన మీరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును చాలా తీవ్రంగా తీసుకోండి, జీవితం అంతిమ సమస్యలను పరిష్కరించుకోండి. జీవితం యొక్క సమస్యలను కృష్ణుని అర్థం చేసుకోవడం ద్వారా పరిష్కరించవచ్చు. కేవలం కృష్ణుని అర్థం చేసుకోవడము ద్వారా.

janma karma ca me divyaṁ
yo jānāti tattvataḥ
tyaktvā dehaṁ punar janma
naiti mām eti kaunteya
(BG 4.9)

ఇది సమస్య పరిష్కారం