TE/Prabhupada 0824 - ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏ భేదాభిప్రాయం లేదు



751101 - Lecture BG 07.05 - Nairobi


కాబట్టి మీరు మానవ స్వభావం అధ్యయనం చేస్తే, ఏదైతే ఉందో, అది కూడా భగవంతుని లో ఉంది. కానీ అది పరిపూర్ణమైనది, అపరిమితమైనది, ఇంకా మనము ఈ రసాయనాల అన్ని లక్షణాలు కలిగి ఉన్నాము- చాలా తక్కువ పరిమాణంలో. భౌతికముగా అది అసంపూర్ణంగా ఉంది. కావున మీరు భౌతిక బంధనము నుండి విముక్తి పొందినట్లయితే, అప్పుడు మీరు పరిపూర్ణము అవుతారు. మనము అర్థం చేసుకోవచ్చు " నేను భగవంతునితో సమానమైన వాడను", కానీ భగవంతుడు గొప్పవాడు. నేను చాలా, చాలా చిన్న వాడను. అది ఆత్మ-సాక్షాత్కారము. అది ఆత్మ సాక్షాత్కారము. మీరు," నేను భగవంతునితో సమానమైన వాడిని", అనుకుంటే, అది మీ మూర్ఖత్వం. నీవు లక్షణములో భగవంతునితో సమానము అయి ఉండచ్చు , కానీ పరిమాణములో నీవు భగవంతుని అంత గొప్పవాడివి కాదు. ఇది ఆత్మ-సాక్షాత్కారము. అందువల్ల శాస్త్రము చెప్తుంది " ఒక చిన్న పరిమాణము గల ఆధ్యాత్మిక కణము మహోన్నతమైన సంపూర్ణమునకు సమానము అయితే , అప్పుడు అతను తన(కృష్ణుని) నియంత్రణలోకి ఎలా వచ్చాడు?" ఇది తార్కికం. మనము నియంత్రణలో ఉన్నాము. భౌతిక వాతావరణములో మనం పూర్తిగా నియంత్రణలో ఉన్నాము. కానీ, మనము ఆధ్యాత్మికముగా స్వేచ్ఛగా ఉన్నప్పుడు, మనము ఇంకా నియంత్రణలో ఉంటాము, ఎందుకంటే భగవంతుడు ఎల్లప్పుడూ గొప్పవాడిగా ఉంటాడు మనము చిన్నగా ఉంటాము.

అందువలన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏ భేదాభిప్రాయం లేదు. భగవంతుడు గొప్పవాడు మనము చిన్నవారము, ఏ భేదాభిప్రాయం లేదు. అది ఆధ్యాత్మిక ప్రపంచం. ఇంకా భౌతిక ప్రపంచం అంటే, " భగవంతుడు గొప్పవాడు, మనము చిన్నవారము" - అక్కడ భిన్నాభిప్రాయం ఉంది. అది భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. జీవి భగవంతుని యొక్క అతి చిన్న కణము. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తన పరిస్థితి గురించి తెలుసు. జీవులు, వారికి తెలుసు, నా పరిస్థితి ఏమిటి? నేను భగవంతుని యొక్క చిన్న కణం. కాబట్టి భేదాభిప్రాయం లేదు. ప్రతీది చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో... నిజానికి అతడు భగవంతుని యొక్క చిన్న కణము, కానీ భేదాభిప్రాయం ఉంది. నేను భగవంతునితో సమానము అని అతడు తప్పుగా ఆలోచిస్తున్నాడు. ఇది భౌతిక జీవితం. ముక్తి అంటే... ఎప్పుడైతే మనము ఈ తప్పు భావన కలిగిన జీవితము నుండి ముక్తులము అవుతామో అది విముక్తి.ముక్తి అంటే...

అందువల్ల భక్తులందరూ ఎవరైతే ప్రాధమికంగా అంగీకరించారో "భగవంతుడు గొప్పవాడు ; నేను చిన్న, అతి చిన్న కణమును. అందువల్ల, ఎలా అయితే చిన్న వారు గొప్పవారిని సేవిస్తారో, నా నిజమైన కర్తవ్యము భగవంతునికి సేవ చేయడము". ఇది ముక్తి. ఇది ముక్తి. అందువలన ఈ సూత్రాన్ని తీసుకున్న ప్రతి భక్తుడు, " భగవంతుడు గొప్పవాడు ; నేను చిన్న వాడను. నేను అందించాలి... నేను గొప్పవారికి సేవను అందించాలి..." అది స్వభావం. ప్రతి ఒక్కరూ పని చేయటానికి, కర్మాగారానికి, కార్యాలయమునకు వెళ్తున్నారు. ఇది ఏమిటి? గొప్పవారికి సేవ చేయడానికి వెళ్తున్నారు. లేకపోతే అతడు ఇంట్లో ఉండి ఉండవచ్చు.ఎందుకు అతడు కర్మాగారానికి వెళ్తున్నాడు, కార్యాలయానికి, ఇది స్వభావం, చిన్న వారు గొప్ప వారిని సేవిస్తారు. కాబట్టి భగవంతుడు, ఆయన చాలా గొప్పవాడు.Anor aniyan mahato mahiyan ( katha upanishad 1.2.20). ఇప్పుడు మీ కర్తవ్యము ఏమిటి? అతడికి సేవను అందించాలి. అంతే. ఇది సహజ స్థితి. భౌతిక ప్రపంచంలో ఆయన ఎవరో ఒకరికి సేవ చేస్తున్నాడు, (అస్పష్టముగా ఉంది) ఇంకొకరికి తన రొట్టె కోసం; ఇప్పటికీ, ఆతడు ఆలోచిస్తున్నాడు," నేను దేవుడను". అతడు ఏ విధమైన భగవంతుడో చూడండి( నవ్వు) ఈ మూర్ఖుడు, అతడు భగవంతుడిని అనుకుంటున్నాడు. అతడిని కార్యాలయము నుండి పంపించివేస్తే, అతడికి రొట్టె దొరకదు, ఇంకా అతడు భగవంతుడు. ఇది భౌతిక ప్రపంచం. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, “నేను భగవంతుడిని”. అందువల్ల వారిని మూర్ఖులు, దుష్టులు అన్నారు.వారు భగవంతునికి శరణాగతి పొందరు. Na mam duskrtino mudhah prapadyante naradamah mayayapahrta jnanah ( BG 7.15) Apahrta-jnanah. అతడి వాస్తవమైన జ్ఞానం తీసివేయబడింది. అతడికి తెలియదు అతడు చిన్నవాడు అని, భగవంతుడు గొప్పవాడు, అతడి కర్తవ్యం భగవంతుని సేవించడమే. ఈ జ్ఞానం తీసివేయబడుతుంది. Mayayapahrta - jnana asuram bhavam asritah ఇది సంకేతం.

ఈ ఒక్క లక్షణం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం అన్నపు కుండ నుండి ఒక్క బియ్యపు గింజ నొక్కడం వలె, మనం అర్థం చేసుకుంటాం అన్నం చక్కగా ఉంది అని. అదే విధముగా, ఒక్క లక్షణం ద్వారా మూర్ఖుడు ఎవరో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క లక్షణం ద్వారా. అది ఏమిటి? Na mam prapadyante. అతడు కృష్ణ భక్తుడు కాడు, అతడు మూర్ఖుడు. అంతే. వెంటనే మీరు తీసుకుంటారు, ఎటువంటి పరిగణ లేకుండా. ఎవరైతే కృష్ణ భక్తుడు కాడో, ఎవరైతే కృష్ణుని శరణాగతి తీసుకోటానికి సిద్ధంగా లేరో, అతడు మూర్ఖుడు. అంతే. ఇది మా అంతిమ అభిప్రాయము.

చాలా ధన్యవాదములు. హరే కృష్ణ