TE/Prabhupada 0825 - మానవ జీవితం కేవలం కృష్ణుని పాదపద్మాలను ఎలా ఆశ్రయించాలి అన్న దాని కోసమే ప్రయత్నించాలి



741102 - Lecture SB 03.25.02 - Bombay


వేదాలలో చెప్పబడింది,

nityo nityānāṁ cetanaś cetanānām
eko bahūnāṁ yo vidadhāti kāmān
(Kaṭha Upaniṣad 2.2.13)

భగవంతుని యొక్క ఐశ్వర్యములు ఏమిటి? ఇది: eko bahūnāṁ yo vidadhāti kāmān. భగవంతుడు, ఏక వచన సంఖ్య, ఇంక nityo nityānām, and nityānām, బహువచనం.

కాబట్టి ఈ జీవులు, మనము, మనము బహువచనం. Jīva-bhāgaḥ sa vijñeyaḥ sa cānantyāya kalpate. ఎన్ని జీవులు ఉన్నాయి, ఎటువంటి పరిమితి లేదు. ఎవరూ లెక్కించలేరు. అనంత. అనంత అంటే మీకు పరిమితి తెలియదు, అంటే "చాలా లక్షలు లేదా చాలా వేల మంది." లేదు. మీరు లెక్కించలేరు. కాబట్టి ఈ జీవులందరు, మనము, జీవులు, మనము ఆయన చే నిర్వహించబడుతునాము. ఇది వేదముల సమాచారం Eko bahūnāṁ yo vidadhāti kāmān. మనం మన కుటుంబాన్ని పోషిస్తున్నటుగా. ఒక వ్యక్తి సంపాదించి, తన కుటుంబాన్ని, భార్యను, పిల్లలను, సేవకులను, ఆశ్రయులను, కార్మికులను, చాలామందిని పోషిస్తున్నాడు. అదేవిధంగా, భగవంతుడు అన్ని జీవులను పోషిస్తున్నాడు. మీకు తెలియదు ఎన్ని ఉన్నాయో. ఆఫ్రికాలో లక్షలాది ఏనుగులు ఉన్నాయి. అవి కూడా ఒకే సమయంలో 40 కేజీలు తింటాయి. కాబట్టి, అవి కూడా పోషింపబడుతున్నాయి. ఇంకా చిన్న చీమ, అది కూడా పోషింపబడుతుంది. వివిధ రకాల 84 లక్షల రూపాలు ఉన్నాయి. వారిని ఎవరు పోషిస్తున్నారు? పోషిస్తున్నారు, భగవంతుడు ఆ ఏక. Eko bahūnāṁ yo vidadhāti kāmān. అది వాస్తవము. అందుచేత ఆయన మనల్ని ఎందుకు పోషించలేడు? ముఖ్యంగా ఎవరైతే భక్తులో, ఎవరైతే భగవంతుని పాదపద్మముల వద్ద ఆశ్రయము తీసుకుంటారో తన సేవ కోసం ప్రతీది విడిచిపెడతారు.

మా కృష్ణ చైతన్య ఉద్యమంలో విధముగానే. మాకు వంద కంటే ఎక్కువ కేంద్రాలు ఉన్నాయి. ఒక్క కేంద్రం... నవభారత టైమ్స్ యొక్క ప్రకటన నుండి మేము చదువుతున్నాము, అవి ఎలా చక్కగా నిర్వహించబడుతున్నాయి. కానీ మాకు వ్యాపారం లేదు. మాకు ఆదాయ వనరులు లేవు. కృష్ణుడి ఆశ్రయమే మాకు ఆదాయం యొక్క ఏకైక మూలం. Samāśritā ye pada-pallava-plavam. కాబట్టి శాస్త్రం చెప్తుంది “మీరు కృష్ణుని ఆశ్రయం పొందండి”. కృష్ణుడు కూడా అదే సత్యాన్ని చెప్పటానికి వస్తాడు. Sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) ఆయన ఎప్పుడూ చెప్పలేదు, “మీరు ఇది చేయండి, అది చేయండి. నేను మీ నిర్వహణ కోసం ఇస్తాను”. లేదు Ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi నేను నిర్వహణ మాత్రమే కాదు, పాపముల ఫలము నుండి నేను మిమ్మల్ని రక్షించెదను. "చాలా హామీ ఉంది. కాబట్టి శాస్త్రము కూడా చెప్తుంది, tasyaiva hetoḥ prayateta kovido na labhyate yad bhramatām upary adhaḥ ( SB 1.5.18) Tasyaiva hetoh prayateta kovidah.కోవిద అంటే తెలివైన, చాలా తెలివైన వ్యక్తి. కాబట్టి ఆయన దేనికోసం ప్రయత్నించాలి? Tasyaiva hetoh: కృష్ణుని పాదపద్మముల వద్ద ఆశ్రయమును పొందటము కోసం. మానవ జీవితం కేవలం శ్రీకృష్ణుని పాదపద్మాలను ఎలా ఆశ్రయించాలి అన్న దాని కోసమే ప్రయత్నించాలి. అది ఒకటే కర్తవ్యంగా ఉండాలి