TE/Prabhupada 0933 - కృష్ణ చైతన్య ఉద్యమం జంతువుల జీవితములోనికి వెళ్లకుండా ఉండటానికి కాపాడుతుంది



730424 - Lecture SB 01.08.32 - Los Angeles


కృష్ణ చైతన్య ఉద్యమం జంతువుల జీవితములోనికి వెళ్లకుండా ఉండటానికి కాపాడుతుంది ప్రభుపాద: దేవకి పుత్రునిగా కృష్ణుడు వచ్చినది దేవకిని కీర్తించడానికి కృష్ణుడు యశోదా కుమారుడు అయ్యి, తన భక్తురాలైన యశోదను కీర్తించాడు. అదేవిధముగా కృష్ణుడు మహారాజు యదు రాజవంశంలో కేవలం కీర్తించడానికి ఆవిర్భవించారు. ఆయన కృష్ణుని గొప్ప భక్తుడు, ... ఆయన మహా రాజు యదు కుటుంబంలో జన్మించాడు. మొత్తం కుటుంబం ఇప్పటికీ వేడుక చేసుకుంటుంది: యాదవ. కృష్ణుని నామము యాదవ, ఎందుకంటే ఆయన యాదవ కుటుంబములో జన్మించాడు. కాబట్టి ఎలా కృష్ణుడు తీసుకున్నాడు...? ఇప్పుడు కుటుంబాన్ని కీర్తించడానికి. సరిగ్గా, ఉదాహరణ ఇవ్వబడింది: ఉదాహరణకు malayasyeva candanam ( SB 1.8.32) చందన. ఇది ఒక చెట్టు. ఒక చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది, కానీ గ్రంధపు చెట్టు, ఇది మలేషియా దేశంలో చాలా ప్రముఖమైనది ఎందుకంటే... నేను చెప్పినట్లు గతంలో, వారు ఈ చందనపు చెట్టును పెంచుతున్నారు, ఎందుకంటే మంచి గిరాకీ ఉంది, ముఖ్యంగా భారతదేశం లో, చందనము పెంచడములో. వాళ్ళు... ఈ రోజుల్లో రబ్బరు చెట్టును పెంచుతున్నారు ఎందుకంటే రబ్బరు కోసం మంచి గిరాకీ ఉంది.

... కాబట్టి వ్యాపారము కోసము అయినా... కుంతీ ఈ మంచి ఉదాహరణ ఇస్తున్నది. ఈ చందనపు చెట్టు, ఈ చెట్టు ప్రత్యేకమైన రకం. ఇది ఎక్కడైనా పెరుగుతుంది. మలేషియాలో లేదా మలయా కొండలలో మాత్రమే పెరగాలని లేదు. అలాంటి నియమాలు మరియు నిబంధనలు లేవు. ఇది ఎక్కడైనా పెరుగుతుంది. అయితే ప్రపంచంలోని ఇటువంటి భాగములో ఈ చందనము పెద్ద పరిమాణంలో పెరుగుతుంది కాబట్టి, చందనమును మలయా-చందనము అని పిలుస్తారు. మలయా-చందనము.

ఉదాహరణకు మీ పాశ్చాత్య దేశాలలో, సుగంధపు నీరు: eau de cologne eau de cologne. cologne ఫ్రాన్స్లో ఒక దేశం...? అక్కడ అది తయారవుతుంది, అందుచే దీనిని eau de cologne అని పిలుస్తారు. అదేవిధముగా, eau de cologne ఎక్కడైనా తయారవుతుంది, మొదట eau de cologne నగరంలో తయారు చేయబడిన కారణంగా, ఇది eau de cologne పిలువబడుతుంది. అదేవిధముగా చందనము కూడా ఎక్కడైనా పెరుగుతుంది, కానీ వాస్తవానికి మలేషియాలో ఇది ప్రముఖంగా ఉంది...

5,000 సంవత్సరాల క్రితం, కుంతీ ఈ ప్రార్ధనను చేస్తుంది. 5,000 సంవత్సరాలకు ముందు అంటే, మలేషియాలో చందనము పెరుగుతోంది. కాబట్టి ఈ మలేషియా కొత్త పేరు కాదు. ఇది వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాలుగా పిలువబడింది. ... ఈ ప్రదేశాలు, అవి వేదముల సంస్కృతి. అదేవిధముగా ఆమె ఉదాహరణను ఇస్తుంది కృష్ణుడు అవసరము లేదు, తను నిర్ధిష్టమైన కుటుంబములో లేదా నిర్ధిష్టమైన దేశంలో తన జన్మ తీసుకోవడానికి ఎటువంటి బాధ్యత లేదు. ఆయనకు అలాంటి బాధ్యత లేదు. ఒక నిర్దిష్ట కుటుంబం లేదా వ్యక్తిని కీర్తించడానికి ఎందుకంటే ఆయన ఒక భక్తుడు కనుక, అందువలన ఆయన జన్మ తీసుకున్నారు.

కారణం ఆయన ఆవిర్భవించడానికి... అందువలన ఇది divyam అని పిలుస్తారు, ఆధ్యాత్మికము. ఆయన బాధ్యత వహించలేదు. కానీ మనము బాధ్యత వహించాలి. మనము జన్మ తీసుకోవడానికి మరియు కృష్ణుడు తీసుకోవడానికి మధ్య వ్యత్యాసం. మనము బాధ్యత వహించము. మన కర్మ వలన, మనము చేసే కార్యక్రమాల వలన, మంచి కుటుంబంలో జన్మించేందుకు మనము అర్హత కలిగి ఉంటాము, అప్పుడు నేను మంచి కుటుంబంలో జన్మ తీసుకుంటాను, లేదా మానవ సమాజంలో, లేదా దేవతల సమాజంలో. కానీ నా పనులు జంతువులు వలె తక్కువ తరగతిగా ఉంటే, అప్పుడు నేను జంతువుల కుటుంబంలో జన్మ తీసుకోవాలి. ఇది బలవంతముగా. Karmaṇā daiva-netreṇa jantur deha upapattaye ( SB 3.31.1) మనము మన కర్మ ప్రకారం ఒక నిర్దిష్ట రకమైన శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటాము.

ఈ జీవితంలో... మానవ జన్మ athāto brahma jijñāsā, కోసము ఉద్దేశించబడినది మహోన్నతమైన, పరమ సత్యము ను అర్థం చేసుకునేందుకు. కానీ మనము అలా చేయకపోతే, మనం జంతువులానే ఉంటే, మళ్ళీ మనం జంతువుల రూపములోనికి వెళ్ళుతాము. అవకాశం దుర్వినియోగం చేసుకుంటున్నాము. అప్పుడు మనము... అందుచే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తుంది, జంతువుల జన్మలోనికి వెళ్లకుండా.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: హరే కృష్ణ, కీర్తి అంతా శ్రీల ప్రభుపాదుల వారికి