TE/Prabhupada 0057 - మనము ఎల్లపుడు హరేకృష్ణ మంత్రమును జపించుటకు ప్రోత్సహించాలి



Lecture on SB 6.1.34-39 -- Surat, December 19, 1970

రేవతినందన: మనము ఎల్లప్పుడూ హరేకృష్ణ మంత్రమును జపించుటకు ప్రోత్సహించాలి. నిజమేనా?

ప్రభుపాద: ఈ యుగమునకు ఇది ఒక్కటే పద్ధతి హరేకృష్ణ మహామంత్రమును జపించుట ద్వారా ప్రతిఒక్కరికి వారి అవగాహన స్పష్టముగా ఉంటుంది. తరువాత ఆయనకి వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానము తీసుకొనగలుగుతాడు హృదయము పవిత్రము కాకపోతే, ఆధ్యాత్మిక జ్ఞానము అర్థము చేసుకొనుట తీసుకొనుట కష్టము. ఈ సంస్కరణ కార్యక్రమాలను - బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్త - అవి కేవలం పవిత్రము చేసే పద్ధతులు భక్తి కూడా పవిత్రము చేసే పద్ధతి. వైధీ భక్తి భగవంతుని ఆరాధనలో తను నిమగ్నమైపోవడం ద్వారా, అతను కూడా పరిశుద్ధుడవుతాడు తత్ పరత్వే... సర్వోపాధి... అతనికి జ్ఞానోదయం కలుగగా, జ్ఞానము అభివృద్ధి చెందగా తాను కృష్ణుడి యొక్క శాశ్వత సేవకుడు అని అర్థం చేసుకుంటాడు, అతని హృదయము పవిత్రము అవుతుంది. అతని హృదయము పవిత్రము అవుతుంది సర్వోపాధి అంటే.. అతను చేయడు... సర్వోపాధి. తన హోదాని ఉపాధిని వదిలేస్తాడు నేను అమెరికన్," "నేను భారతీయుడిని," " నేను ఇది," "నేను అది. కాబట్టి ఈ విధముగా, మీకు జీవితం యొక్క ఈ శరీర భావన పూర్తిగా తొలగిపోయినప్పుడు, అప్పుడు నిర్మలం అతడు నిర్మలము అవుతాడు కల్మషము లేకుండా ఎంత కాలము ఈ శరీర భావనలో "నేను ఇది", "నేను అది," "నేను అది," ఆయన ఇప్పటికీ అదే స్థితిలో వుంటాడు.. కావున భక్తః ప్రకృతః స్మృతః . సరిగ్గా కూర్చోండి. అలాకాదు స భక్తః ప్రకృతః స్మృతః . అర్చాయం ఏవ హరయే... ఈ పద్ధతిలో, వారిని భగవంతుని అర్చాముర్తి ఆరాధనలో వినియోగించినప్పుడు, అర్చాయం ఏవ హరయే యత్ పూజాశ్రద్ధాయేహతే, గొప్ప భక్తి తో, కానీ న తద్ భక్తేషు కనీషు, కానీ ఆయనకు ఇతరుల గురించి ఆలోచన ఉండదు లేదా ఆయనకు ఒక భక్తుడు యొక్క పరిస్థితి ఏమిటో తెలియదు అప్పుడు స భక్తః ప్రకృతః స్మృతః : ఆయన భౌతిక భక్తుడు కాబట్టి మనము భౌతిక భక్తి దశ నుండి మనము ఎదగాలి రెండో స్థాయికి ఎదగాలి, భక్తుడు అంటే ఏమిటి అని అర్థము చేసుకొనే స్థాయికి ఆభక్తుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు నాస్తికుడు అంటే ఎవరు ఈ తేడాలు ఉన్నాయి. పరమహంస స్థాయిలో ఈ తేడా వుండదు ఆయన ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క సేవలో వినియోగించినట్లుగా చూస్తుంటాడు ఆయన ఎవరి మీద అసూయపడడు, ఆయన ఎవ్వరిని చూడడు, ఏమి చూడరు. ఇది ఇంకో దశ. దీనిని మనము అనుకరించకూడదు, అనుకరించటానికి ప్రయిత్నించకూడదు పరమహంస దశ పరిపూర్ణతలో ఉన్నత దశ బోధకుడిగా మనము ఎత్తి చూపించవలసి ఉంటుంది... నేను ఈ అబ్బాయికి చెప్పినట్లుగా, "నీవు ఈ విధముగా కూర్చో ఒక పరమహంస చెప్పడు. పరమహంస చూస్తాడు, అతడు బాగానే ఉన్నాడు అని అనుకుంటాడు ఆయన చూస్తాడు, మనము పరమహంసలను అనుకరించకూడదు మనము బోధకులము, మనము గురువులము అయినా మనము పరమహంసలను అనుకరించ కూడదు మనము సరైన దిశను సరైన మూలమును చూపెట్టాలి,

రేవతినందన: ప్రభుపాద మీరు పరమహంస స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారు

ప్రభుపాద: నేను నీకంటే అధమ స్థాయిలో వున్నాను. నీకంటే అధమ స్థాయిలో వున్నాను.

రేవతినందన: మీరు చాలా అందముగా ఉన్నారు, మీరు పరమహంస. అయినప్పటికీ మీరు మాకు ప్రచారము చేస్తున్నారు

ప్రభుపాద: లేదు నేను నీకంటే అధమ స్థాయిలో వున్నాను. అన్ని జీవుల కంటే అధమ స్థాయిలో వున్నాను. నేను నా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాన్ని పాటించటానికి ప్రయత్నిస్తాను. అంతే అది ప్రతి ఒక్కరి ధర్మము అయి ఉండాలి మీరు బాగా ప్రయత్నించండి, ఉన్నత భక్తులు ఇచ్చిన ఆదేశములను పాటించుటకు బాగా ప్రయత్నము చేయండి అది అభివృద్ధి చెందుటకు సురక్షితమైన మార్గం మనము అతి తక్కువ దశలో ఉండవచ్చు కానీ అతడికి శరణాగతి పొంది విధులను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు, అప్పుడు అతడు సంపూర్ణుడు అతడు అతి తక్కువ దశలో ఉండవచ్చును, కానీ అతడు శరణాగతి పొంది విధులను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు, అప్పుడు ఆయన సంపూర్ణుడు ఇది మన ఆలోచన విధానము